DC vs KKR: కోల్‌కతా భారమంతా అయ్యర్ మీదే.. ఢిల్లీకి వార్నర్‌తో పాటు అండగా ఉండేదెవరు?

ఢిల్లీ-కోల్‌కతా చివరగా తలపడ్డ ఐదు మ్యాచులలో ఢిల్లీ మూడు మ్యాచులు నెగ్గి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. కోల్‌కతా రెండు మ్యాచులు గెలిచింది. ఢిల్లీ తరఫున కెప్టెన్ డేవిడ్ వార్నర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. అతడు ఈ సీజన్‌లో డీసీ తరపున ఆడిన చివరి 5 ఇన్నింగ్స్‌లలో సగటు 45.60 కలిగి ఉన్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 20, 2023 | 04:07 PMLast Updated on: Apr 20, 2023 | 4:07 PM

Delhi Capitals Can Break 5 Match Losing Streak Vs Kkr Spirits Are High In Dc Camp

DC vs KKR: ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మ్యాచ్ గురువారం ఢిల్లీలో జరగబోతుంది. సాయంత్రం ఏడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. కోల్‌కతాకు సంబంధించి వెంకటేశ్ అయ్యర్ ఈ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తూ జట్టుకు అండగా నిలుస్తున్నాడు. అయ్యర్ కేకేఆర్ తరఫున ఆడిన గత 5 మ్యాచ్‌లలో 46.80 సగటుతో 234 పరుగులు చేశాడు.

ఈ ఐపీఎల్ సీజన్‌లోనే సెకండ్ హైయెస్ట్ స్కోరర్‌గా నిలిచాడు. ఢిల్లీ-కోల్‌కతా చివరగా తలపడ్డ ఐదు మ్యాచులలో ఢిల్లీ మూడు మ్యాచులు నెగ్గి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. కోల్‌కతా రెండు మ్యాచులు గెలిచింది. ఢిల్లీ తరఫున కెప్టెన్ డేవిడ్ వార్నర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. అతడు ఈ సీజన్‌లో డీసీ తరపున ఆడిన చివరి 5 ఇన్నింగ్స్‌లలో సగటు 45.60 కలిగి ఉన్నాడు. కేకేఆర్ జట్టు ప్రస్తుతం వరుస ఓటముల్లో ఉంది. సన్‌రైజర్స్, ముంబై ఇండియన్స్‌తో జరిగిన చివరి రెండు మ్యాచుల్లో కేకేఆర్ ఓడిపోయింది. అంతకుముందు గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సాధించిన రెండు అద్భుతమైన విజయాలతో ఉన్న ఊపును కేకేఆర్ కోల్పోయింది.

ఇప్పుడు మళ్లీ గెలుపు ట్రాక్‌లోకి రావడానికి, ఈ సీజన్‌లో సరైన గ్రిప్ దొరక్క ఇబ్బంది పడుతున్న డీసీని ఈరోజు ఎదుర్కోబోతుంది. ఇప్పటివరకు, కేకేఆర్ జట్టు విజయాన్ని నమోదు చేయడానికి ఈ సీజన్‌లో సమిష్టి ప్రయత్నాలైతే కనబడలేదు. కేకేఆర్ ప్రతి మ్యాచులో కూడా బలమైన ప్రదర్శన చేయడానికి కొంతమంది ఆటగాళ్లపైనే ఆధారపడుతుంది. కాబట్టి కేకేఆర్ భారీ స్కోర్ చేసినప్పటికీ చివరి రెండు మ్యాచులను ఓడిపోయారు. ఇప్పుడు ఢిల్లీపై గెలవాలంటే ప్రధానంగా ఈ లోపాలపై దృష్టి పెట్టాల్సి ఉంది. ఢిల్లీ స్టేడియంలో ఇప్పటి వరకు 7 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. ఆ ఏడు మ్యాచులలో లక్ష్యాన్ని ఛేదించిన జట్టు 4 సార్లు గెలిచింది. ఇక్కడ, సాధారణ ట్రెండ్ ఏమిటంటే, గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంటాడు.