Delhi vs Bangalore: సర్దుకుంటారా? సక్సెస్ కొడతారా?
ఐ పి ఎల్ 2023 లో నేడు ఢిల్లీ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది. వరుస ప్లాప్ లతో ఉన్న ఢిల్లీ జట్టు, బెంగళూరు వేదికగా కమ్ బ్యాక్ అవ్వాలని చూస్తే, హ్యాట్రిక్ ఓటమి నుంచి గట్టెక్కాలని బెంగళూరు జట్టు ఆరాటపడుతుంది.

Delhi vs Bangalore Match
ఈ రెండు జట్ల మధ్య జరిగిన ప్రీవియస్ రికార్డ్స్ చూస్తే, 27 సార్లు అమీతుమీకి దిగిన ఈ రెండు జట్లలో, ఢిల్లీ క్యాపిటల్స్ పదిసార్లు గెలవగా, బెంగళూరు టీమ్ పదహారు సార్లు విక్టరీని సాధించింది. ఒక మ్యాచులో ఫలితం తేలకపోగా, చివరగా ఆడిన మ్యాచులో బెంగళూరు జట్టు పైచేయి సాధించింది. ఢిల్లీ మీద 215 పరుగుల అత్యధిక స్కోర్ నిలిపిన బెంగళూరు, 137 పరుగుల అత్యల్ప స్కోర్ ను మూటగట్టుకుంది.
ఆర్ సి బి మీద ఢిల్లీ అత్యధిక స్కోర్ 196 కాగా, 95 పరుగులకే ఒకసారి చాపచుట్టేసి, తక్కువస్కోర్ ను నమోదు చేసుకుంది. ప్రతి మ్యాచులో రాణిస్తున్న ఢిల్లీ కెప్టెన్ వార్నర్ కు అదృష్టంతో పాటు, ఆటగాళ్లు కూడా కలిసిరావడం లేదు. ఇక బెంగళూరు కూడా ఒక డిపార్ట్మెంట్ టాప్ లేపగా, మరో డిపార్ట్మెంట్ అట్టర్ ప్లాప్ అవుతూ, అపజయాలను అంగీకరించక తప్పట్లేదు. చిన్నస్వామి వేదికగా మొదలుకానున్న మధ్యాహ్నం మ్యాచులో, పరుగుల వరద పారడం మాత్రం కన్ఫామ్. ఇరుజట్లలో కూడా పించ్ హిట్టర్స్ పుష్కలంగా ఉండడంతో, అభిమానులకు మంచి ఎంటర్టైన్మెంట్ చూసే అవకాశం కలగనుంది.