Devon Conway: చెన్నై సూపర్ కింగ్స్‌కు షాక్.. గాయంతో స్టార్ ఓపెనర్ ఔట్
ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో కాన్వే ఎడమ కాలి బొటనవేలికి తీవ్ర గాయమైంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లోని తొలి మ్యాచ్‌కు కూడా అతడు దూరమయ్యాడు. మరోవైపు వైద్యసిబ్బంది సూచనల మేరకు ఈ వారంలో కాన్వే సర్జరీ చేయించుకోనున్నాడు.

Devon Conway: ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్ తగిలింది. గత సీజన్‌లో చెన్నై టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన ఓపెనర్ డెవాన్ కాన్వే.. ఈ సీజన్‌లో దాదాపు సగం మ్యాచ్‌లకు దూరంకానున్నాడు. గాయం కారణంగా మే వరకు ఐపీఎల్‌లో కాన్వే బరిలోకి దిగే అవకాశాలు లేవు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో కాన్వే ఎడమ కాలి బొటనవేలికి తీవ్ర గాయమైంది.
Gautam Gambhir: ఐపీఎల్ అంటే పార్టీలు కాదు.. ఆటపై ఫోకస్ పెట్టాలని గంభీర్ వార్నింగ్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లోని తొలి మ్యాచ్‌కు కూడా అతడు దూరమయ్యాడు. మరోవైపు వైద్యసిబ్బంది సూచనల మేరకు ఈ వారంలో కాన్వే సర్జరీ చేయించుకోనున్నాడు. దీంతో కాన్వే కనీసం రెండు నెలల పాటు ఆటకు దూరం కానున్నాడు. కాన్వే స్థానంలో అజింక్య రహానె లేదా రచిన్ రవీంద్ర ఓపెనర్‌గా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన మినీ వేలంలో రవీంద్రను సీఎస్‌కే రూ.1.80 కోట్లకు సొంతం చేసుకుంది. పరిమిత ఓవర్లలో టాప్ ఆర్డర్‌లో సత్తాచాటగలనని రచిన్ రవీంద్ర ఇప్పటికే నిరూపించుకున్నాడు.
మరోవైపు ఓపెనర్‌గా గత ఐపీఎల్ సీజన్లలో రాణించిన రహానె ప్రస్తుతం ఫామ్ కోల్పోయాడు. ఈ నేపథ్యంలో ఓపెనర్‌గా రచిన్‌ను సీఎస్‌కే యాజమాన్యం ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి. కాగా మార్చి 22 నుంచి మొదలుకానున్న ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభమ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.