నేపాల్ ప్రీమియర్ లీగ్ లో గబ్బర్, ఫ్రాంచైజీ క్రికెట్ లో బిజీగా ధావన్
అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ ఫ్రాంచైజీ లీగ్స్ తో బిజీగా బిజీగా గడుపుతున్నాడు.

అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ ఫ్రాంచైజీ లీగ్స్ తో బిజీగా బిజీగా గడుపుతున్నాడు. ఇటీవలే భారత్ వేదికగా జరిగిన లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీలో గుజరాత్ జెయింట్స్‌కు సారథిగా వ్యవహరించిన గబ్బర్ ఇప్పుడు మరో ఫ్రాంచైజీ క్రికెట్ టోర్నీలో ఆడబోతున్నాడు. నేపాల్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ సీజన్‌లో ధావన్ ఎంట్రీ ఇవ్వనున్నాు. ఈ టోర్నీలో కర్నాలీ యాక్స్ ఫ్రాంచైజీకి ధావన్ ప్రాతినిథ్యం వహించనున్నాడు. షార్ట్ ఫార్మాట్ లో ధావన్ కు అద్భుతమైన రికార్డుంది. ఐపీఎల్‌లో కూడా అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ధావన్ రెండో స్ధానంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే మొత్తం 8 జట్లు ఆడనున్న నేపాల్ ప్రీమియర్ లీగ్ నవంబర్ 30 నుంచి డిసెంబర్ 21 వరకు జరగనుంది.