ధోని.. ఇక చాలు.. రిటైర్ అయిపో !
ధోని.. ఇదో పేరు మాత్రమే కాదు.. సగటు క్రికెట్ అభిమాని ఎమోషన్ ! 7 నంబర్ కనిపించినా.. ఎక్కడైనా ధోని పేరు వినిపించినా.. గూస్‌బంప్స్ తెచ్చుకునే ఫ్యాన్స్ మాహీ సొంతం. ప్రపంచం మొత్తంలో ఒకే క్రికెట్ జట్టు ఉంటే.. దానికి కెప్టెన్ అతనే !

ధోని.. ఇదో పేరు మాత్రమే కాదు.. సగటు క్రికెట్ అభిమాని ఎమోషన్ ! 7 నంబర్ కనిపించినా.. ఎక్కడైనా ధోని పేరు వినిపించినా.. గూస్‌బంప్స్ తెచ్చుకునే ఫ్యాన్స్ మాహీ సొంతం. ప్రపంచం మొత్తంలో ఒకే క్రికెట్ జట్టు ఉంటే.. దానికి కెప్టెన్ అతనే ! ఇదీ అభిమానులు మాట్లాడుకునే మాట. తల ఫర్ ఏ రీజన్ అంటూ.. సోషల్ మీడియాలో చేసే హడావుడి అంతా ఇంతా కాదు. నిజానికి మిస్టర్ కూల్ కెప్టెన్‌గా ధోని క్రియేట్ చేసిన రికార్డులు అలాంటివి ! మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన నాయకుడిగా రికార్డు క్రియేట్ చేశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు దూరమైనా.. ఐపీఎల్‌లో ఆడుతూ ఫ్యాన్స్‌కు ఆనందాన్ని పంచుతున్నాడు మాహీ. ఐతే ధోని రిటైర్మెంట్ చుట్టూ ఎప్పుడూ ఓ డిస్కషన్ నడుస్తూనే ఉంటుంది. టీషర్ట్ మీద వన్ లాస్ట్ ఛాన్స్ అని రాసుకున్నా.. పేరెంట్స్ మ్యాచ్‌లో కనిపించినా.. అన్నింటి వెనక చర్చ ఒక్కటే.. ధోని రిటైర్మెంట్ అని ! గత మూడు సీజన్‌ల నుంచి ఇదే డిస్కషన్ నడుస్తోంది. ఊహాగానాలు తప్పు అని ప్రతీసారి ధోని.. ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తూనే ఉన్నాడు.
ఈ ఐపీఎల్ తర్వాత ధోని రిటైర్ అవుతారని.. కప్ నెగ్గి ఘనంగా వీడ్కోలు ఇవ్వాలంటూ ఫ్యాన్స్ సోషల్‌మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. ఐతే ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అట్టర్‌ఫ్లాప్ షో ఇస్తోంది. ఐదుసార్లు కప్ కొట్టిన జట్టేనా ఇది అనిపిస్తోంది.. వాళ్ల ప్రదర్శన చూస్తుంటే ! ధోని ఆటతీరు చుట్టూ కూడా విమర్శలు వినిపిస్తున్నాయ్. గెలిచే మ్యాచ్‌లో ముందొస్తాడు.. గెలిపించాల్సిన మ్యాచ్‌లో చివరలో వస్తాడు అంటూ.. కామెంట్స్ చేసే వారు ఎందరో ! ఇలాంటి కామెంట్స్ మధ్య… చెన్నై సూపర్‌కింగ్స్ మాజీ ఓపెనర్ హెడెన్ చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్ అవుతున్నాయ్. ధోనీ కామెంట్రీ బాక్స్‌లో జాయిన్ అవ్వొచ్చు అంటూ హెడ్డీ చేసిన వ్యాఖ్యలు స్పోర్ట్స్ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్ అవుతున్నాయ్. ధోనిలో ఆట పూర్తిగా పోయిందని.. ఈ నిజాన్ని అంగీకరించాలంటూ హెడెన్ హాట్ కామెంట్స్ చేశాడు. ధోనీ వచ్చి ఇక తమతో పాటు.. కామెంట్రీ బాక్సులో మైక్ పట్టుకోవాలన్నాడు.
ఇక అటు మాహీ ఆటతీరుపై కొందరు అభిమానుల్లోనూ ఇలాంటి చర్చే జరుగుతోంది. ధోనీ ఓ లెజెండ్… ఐదు ట్రోఫీలు అందించాడు. అయినా సరే వయసు ప్రభావం.. తెలియకుండానే అతని బ్యాటింగ్‌పై పడుతోందని.. గతంలో ధోనీ అద్భుత ప్రదర్శన చూసిన వారికి ఇప్పుడు అతని ఆట చూడడం కష్టంగా అనిపించిందనే వాళ్లు ఉన్నారు. ఢిల్లీతో మ్యాచ్‌లో 19 బాల్స్ ఆడిన తర్వాత ధోని ఫస్ట్ బౌండరీ కొట్టాడు. ఆట పరిస్థితి తెలిసినా.. దూకుడుగా ఆడటానికి ప్రయత్నించకుండా.. నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. ఓటమి దాదాపుగా ఖాయం అయిన తర్వాతే చివరి ఓవర్లో ఒక సిక్స్, ఫోర్ కొట్టిన ధోనీపై విమర్శలు వినిపిస్తున్నాయ్. ఇక అటు ఢిల్లీతో మ్యాచ్ తర్వాత ధోని రిటైర్మెంట్ హ్యాష్‌ట్యాగ్.. ట్విట్టర్‌లో ట్రెండ్ అయింది. దీంతో ధోని రిటైర్మెంట్‌కు టైమ్ వచ్చేసిందంటూ పోస్టులు పెడుతున్నారు.