నా నిర్ణయం అప్పుడు చెప్తా చెన్నై ఓనర్ కు ధోనీ రిప్లై

ఐపీఎల్ మెగా వేలం తేదీ దగ్గర పడుతోంది. నవంబర్ చివరి వారంలో ఆటగాళ్ళ వేలం జరగనుండగా...ఇప్పటికే బీసీసీఐ రిటెన్షన్ రూల్స్ ను కూడా ఖరారు చేసింది. అటు ఫ్రాంచైజీలు కూడా తమ జాబితాపై కసరత్తు దాదాపు పూర్తి చేసుకుంటున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 22, 2024 | 02:06 PMLast Updated on: Oct 22, 2024 | 2:06 PM

Dhoni Reaction On Next Ipl Season

ఐపీఎల్ మెగా వేలం తేదీ దగ్గర పడుతోంది. నవంబర్ చివరి వారంలో ఆటగాళ్ళ వేలం జరగనుండగా…ఇప్పటికే బీసీసీఐ రిటెన్షన్ రూల్స్ ను కూడా ఖరారు చేసింది. అటు ఫ్రాంచైజీలు కూడా తమ జాబితాపై కసరత్తు దాదాపు పూర్తి చేసుకుంటున్నాయి. ఈ సారి మెగా వేలంలో పలువురు స్టార్ ప్లేయర్స్ కోసం గట్టిపోటీ ఖాయంగా కనిపిస్తోంది. కొన్ని ఫ్రాంచైజీలు కొందరిని వేలంలోకి వదిలేయక తప్పడం లేదు. అలాగే మరికొన్ని ఫ్రాంచైజీల జాబితా ఎలా ఉండబోతోందన్న దానిపైనా ఆసక్తి పెరిగిపోతోంది. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని రిటైన్ చేసుకుంటుందా… అటు ధోనీ అసలు ప్లేయర్ గా వచ్చే సీజన్ లో కనిపిస్తాడా అన్న ప్రశ్నలు అందరిలోనూ ఉన్నాయి. నిజానికి ధోనీని అన్ క్యాప్డ్ కేటగిరీలో రిటైన్ చేసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణయించుకుంది. ఒకవిధంగా ధోనీ కోసమే బీసీసీఐని ఈ రూల్ కోసం ఒప్పంచినట్టు కూడా వార్తలు వచ్చాయి.

అన్ క్యాప్డ్ కేటగిరీలో రిటైన్ చేసుకుంటే సీఎస్కే కేవలం 4 కోట్లు ధోనీకి చెల్లిస్తే సరిపోతుంది. అయితే ధోనీ వచ్చే సీజన్ లో ఆడతాడా అనేది గత కొంతకాలంగా అందరినీ వేధిస్తున్న ప్రశ్న. దీనిపై ఇప్పటికీ అతను క్లారిటీ ఇవ్వలేదని చెన్నై ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ కూడా ఇదే మాట చెప్పారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ధోనీ ఆడాలని తాము కోరుకుంటున్నామనీ, అయితే తాను అందుబాటులో ఉండడం గురించి ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదన్నారు. దీనిపై అడిగినప్పుడు అక్టోబర్ 31వ తేదీ లోపు చెప్తానని తమకు రిప్లై ఇచ్చాడని తెలిపారు. వచ్చే సీజన్ లో అతను ఆడతాడనే నమ్మకుం ఉందని చెప్పుకొచ్చారు.

43 ఏళ్ళ ధోనీ తొలి సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇప్పటి వరకూ 264 మ్యాచ్ లలో 5 వేలకు పైగా పరుగులు చేశాడు. ఏకంగా ఐదుసార్లు చెన్నై సూపర్ కింగ్స్ ను ఛాంపియన్ గా నిలిపిన ధోనీ ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా రికార్డులకెక్కాడు. అయితే గత గత ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు చెన్నై కెప్టెన్సీ నుంచి ధోనీ తప్పుకున్నాడు. అతని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌ జట్టు పగ్గాలు అందుకున్నాడు. కాగా 2024 సీజన్ ముగిసిన వెంటనే ధోనీ ముంబైలో సర్జరీ చేయించుకున్నాడు. మోకాలి నొప్పితో ఇప్పటికీ కాస్త ఇబ్బంది పడుతుండడంతో వచ్చే సీజన్ లో ధోనీ ప్లేయర్ గా కనిపించడంపై సస్పెన్స్ కొనసాగుతోంది.