ఆ రోజే వీడ్కోలు పలుకుతా రిటైర్మెంట్ పై తేల్చేసిన ధోనీ

భారత క్రికెట్ లో ధోనీ ఓ లెజెండరీ కెప్టెన్... బెస్ట్ వికెట్ కీపర్ గానే కాదు బెస్ట్ కెప్టెన్ గా అంతకుమించి బెస్ట్ ఫినిషర్ గానూ గుర్తింపు తెచ్చుకున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 7, 2025 | 12:30 PMLast Updated on: Apr 07, 2025 | 12:30 PM

Dhoni Sensational Comments

భారత క్రికెట్ లో ధోనీ ఓ లెజెండరీ కెప్టెన్… బెస్ట్ వికెట్ కీపర్ గానే కాదు బెస్ట్ కెప్టెన్ గా అంతకుమించి బెస్ట్ ఫినిషర్ గానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పి ఐదేళ్ళు దాటినా ఐపీఎల్ లో మాత్రం ఫ్యాన్స్ ను అలరిస్తున్నాడు. కానీ గత కొన్ని సీజన్లుగా ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్ పై వార్తలు వస్తూనే ఉన్నా… అతను మాత్రం లీగ్ లో కొనసాగుతున్నాడు. ఎప్పటికప్పుడు రిటైర్మెంట్ పై క్లారిటీ ఇస్తున్నా ఈ సీజన్ లోనూ దానిపై చర్చ జరుగుతూనే ఉంది. మునుపటిలా బ్యాటింగ్ చేయలేకపోతుండడంతో ధోనీ వీడ్కోలు టైమ్ వచ్చేసిందంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
తాజాగా సీఎస్కే వర్సెస్ దిల్లీ క్యాపిటల్స్ మ్యాచుకు ధోనీ తల్లిదండ్రులు పాన్‌ సింగ్, దేవకి దేవిలు రావడంతో.. మరోసారి మహీ ఐపీఎల్ రిటైర్మెంట్ ప్రచారం ఊపందుకుంది. ధోనీ ఐపీఎల్ కు వీడ్కోలు పలుకుతాడని అంతా ఫిక్సైపోయారు. ఈ నేపథ్యంలో ధోనీ తన రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చేశాడు.

ఇప్పటికిప్పుడు మెగా లీగ్‌‌‌‌‌‌‌‌కు గుడ్‌‌‌‌‌‌‌‌బై చెప్పే అవకాశమే లేదని స్పష్టం చేశాడు. ఈ విషయంపై ఏడాదికి ఒకసారి సమీక్షించుకుంటానని చెప్పాడు. ప్రస్తుతం నాకు 43 ఏళ్ళని, లీగ్‌‌‌‌‌‌‌‌లో కొనసాగాలా..? వదా..? అన్నది నిర్ణయించుకోవడానికి తనకు ఇంకా 10 నెలల సమయం ఉందన్నాడు. తన రిటైర్మెంట్‌‌‌‌‌‌‌‌ను నిర్ణయించేది తాను కాదనీ, తన శరీరమే చెప్పాలన్నాడు. సీజన్‌‌‌‌‌‌‌‌కు ముందు శరీరం సహకరిస్తుందనిపిస్తే ఆడతాననీ, లేదంటే ఆపేస్తానని చెప్పాడు. ఇక చాలు అనే వరకు ఇదే విధానాన్ని కొనసాగిస్తానని మహీ ఓ పాడ్‌‌కాస్ట్‌‌లో ఇంటర్యూలో వెల్లడించాడు.

దిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచుకు ధోనీ తల్లిదండ్రులు రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. మహీ నిజంగానే ఐపీఎల్ కు రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నాడా ఏంటి అని అందరూ చర్చించుకోవడం ప్రారంభించారు. ధోనీ రిటైర్మెంట్ హ్యాష్ ట్యాగ్ కూడా బాగా ట్రెండ్ అయింది. ఈ నేపథ్యంలో తన ఐపీఎల్ రిటైర్మెంట్ ప్రచారంపై మహీ స్పష్టత ఇవ్వడంతో ఫ్యాన్స్ రిలాక్సయ్యారు. ఇదిలా ఉంటే
ధోనీ ఈ ఐపీఎల్ సీజన్ లో ఎప్పటిలాగే చివర్లో కాస్త అటు ఇటుగా బ్యాటింగ్ కు వచ్చి బానే మెరుపులు మెరిపిస్తున్నాడు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచుల్లో 0, 30 నాటౌట్, 16, 30 స్కోర్లు చేశాడు. అలానే రెప్పపాటు వేగంతో కళ్లు చెదిరేలా రెండు స్టంప్ ఔట్లు కూడా చేశాడు. దీంతో మహీ వికెట్ కీపింగ్ నైపుణ్యానికి క్రికెట్ ప్రపంచమంతా ఆశ్యర్యపడింది. బ్యాటింగ్‌లోనూ ధోనీ ఇంకాస్త దూకుడు చూపిస్తే మరికొన్నేళ్లు అతడికి లీగ్‌లో ఎదురులేనట్లే అని పలువురు క్రికెట్ అభిమానులు అంటున్నారు. మరోవైపు ఇదే సమయంలో అతడి బ్యాటింగ్ ఆర్డర్ పై విమర్శలు కూడా వస్తున్నాయి.