ప్రాక్టీస్ మొదలెట్టిన ధోనీ బ్యాట్ పై సంచలన నిర్ణయం

ఐపీఎల్ 18వ సీజన్ వచ్చే నెల చివరి వారంలో మొదలుకాబోతోంది. ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు సన్నాహాల్లో బిజీగా ఉన్నాయి. అందుబాటులో ఉన్న యువ ఆటగాళ్ళతో ప్రాక్టీస్ క్యాంపులు మొదలుపెట్టాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 26, 2025 | 04:30 PMLast Updated on: Feb 26, 2025 | 4:30 PM

Dhoni Started Practice Sensational Decision On The Bat

ఐపీఎల్ 18వ సీజన్ వచ్చే నెల చివరి వారంలో మొదలుకాబోతోంది. ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు సన్నాహాల్లో బిజీగా ఉన్నాయి. అందుబాటులో ఉన్న యువ ఆటగాళ్ళతో ప్రాక్టీస్ క్యాంపులు మొదలుపెట్టాయి. అటు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కూడా ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు. సీఎస్కే ప్రాక్టీస్ క్యాంపులో జాయినైన మహి వచ్చే సీజన్ కోసం ముమ్మరంగా సాధన చేశాడు. ఈ క్రమంలో ధోనీ కీలక నిర్ణయం తీసుకున్నాడు. బ్యాట్ బరువును తగ్గించుకుంటున్నాడు. సాధారణంగా ధోనీ వినియోగించే బ్యాట్ బరువు 1250 నుంచి1300 గ్రాములు ఉంటుంది. గతంలోనూ ధోనీ అత్యంత బరువు ఉన్న బ్యాట్ ను వాడేవాడు. కానీ ఈ సారి బ్యాట్ బరువును కనీసం 10- 20 గ్రాములు తగ్గించుకుంటున్నట్టు తెలుస్తోంది. బ్యాట్ 1230 గ్రాముల బరువు ఉండేలా తయారు చేయించుకుంటున్నాడని సమాచారం.

కాగా, గత ఐపీఎల్ సీజన్​లో ధోనీ ఎక్కువగా ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్​కు దిగాడు. ఆ సీజన్​లో కొన్ని మెరుపు ఇన్నింగ్స్​లు ఆడాడు. డెత్​ ఓవర్లలో సిక్సర్ల వర్షం కురిపించి జట్టు స్కోరును పరుగులు పెట్టించాడు. ఈ ఏడాది బ్యాటింగ్ ఆర్డర్​లో మరింత ముందొచ్చి రాణించాలని మిస్టర్ కూల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సారి ధోనీని చెన్నై ఫ్రాంచైజీ అన్ క్యాప్డ్ కేటగిరీలో రిటైన్ చేసుకుంది. అలాగే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తో పాటు శివమ్ దూబే, రవీంద్ర జడేజా మహేశ పతిరణను రిటైన్ చేసుకున్న చెన్నై వేలంలో పలువురు స్టార్ ప్లేయర్స్ ను కూడా దక్కించుకుంది.

మెగా వేలంలో రాహుల్ త్రిపాఠి, రచిన్ రవీంద్ర, రవిచంద్రన్ అశ్విన్, ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, సామ్ కర్రన్ వంటి వారిని తీసుకుంది. కాగా చెన్నై ప్రాక్టీస్ క్యాంపులో ధోనీ, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సహా అందుబాటులో ఉన్న ప్లేయర్లంతా చేరుతున్నారు. అంతర్జాతీయ ప్లేయర్లు మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీ ముగిశాక జట్టుతో కలుస్తారు. మార్చి రెండో వారంలో రవీంద్ర జడేజా, రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే లాంటి ప్లేయర్లు సీఎస్కే శిబిరంలో చేరనున్నారు. గత సీజన్‌లో మాదిరిగానే ఈసారి కూడా లీగ్‌ దశలో 70 మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్లే ఆఫ్స్, ఫైనల్‌తో కలిపి మొత్తం 74 మ్యాచ్‌లు ఉంటాయి. ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తన తొలి మ్యాచ్‌లో మార్చి 23న ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది.