MS Dhoni: దారి తప్పిన ధోని కాపాడిన అభిమానులు
దేశవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను కలిగి ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం తన విరామ సమయాన్ని తన స్వంత ఊరు రాంచీలో గడపుతున్నారు.

Having lost his way with Ranchi, Dhoni asked that passer-by how to get there
దేశవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను కలిగి ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం తన విరామ సమయాన్ని తన స్వంత ఊరు రాంచీలో గడపుతున్నారు. చిన్ననాటి స్నేహితులతో కలిసి సరదాగా తిరుగుతున్నారు. మహీ ఎక్కడకు వెళ్లినా అభిమానులు ఆయనను ఫాలో అవుతుంటారు. అయినా ధోనీ ఇబ్బంది పడకుండా వారితో సరదాగా మాట్లాడుతుంటారు. ధోనీ సింప్లిసిటీని తెలిపే మరో వీడియో నెట్టింట వైరల్‌గా మారి అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో ధోని తన స్నేహితుడితో కలిసి కారులో వెళ్తున్నారు. ఆయన స్నేహితుడు కారు నడుపుతుండగా, ధోనీ పక్కన కూర్చున్నారు.
మార్గమధ్యంలో వారికి దారి తెలీకపోవడంతో అదేదారిలో వెళుతున్న ఓ బైకర్‌ను రాంచీకి ఎటు వెళ్లాలి? అంటూ ధోని అడిగారు. ఒక్కసారిగా ధోనీ అలా రోడ్డుమీద కారులో ప్రత్యక్షమవడం, తనని అడ్రస్ అడగడంతో ఆ అభిమాని ఉబ్బి తబ్బిబ్బయిపోయాడు. అలా ముందుకు వెళితే నాలుగు రోడ్ల సర్కిల్ ఒకటి వస్తుంది, దాన్ని దాటి ముందుకెళితే రాంచీ వస్తుంది అని అభిమాని చెప్పాడు. ఆ తరువాత తన ఫ్యాన్‌తో ధోనీ సెల్ఫీ దిగి ముందుకెళ్లిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.