MS Dhoni : ధోనీ ఇది కరెక్ట్ కాదనుకుంటా…
చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings), పంజాబ్ కింగ్స్ (Punjab Kings) మ్యాచ్ లో ధోని (MS Dhoni) చేసిన ఆ ఒక్క పని అభిమానులకు నచ్చడం లేదు.

Dhoni thinks this is not correct...
చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings), పంజాబ్ కింగ్స్ (Punjab Kings) మ్యాచ్ లో ధోని (MS Dhoni) చేసిన ఆ ఒక్క పని అభిమానులకు నచ్చడం లేదు. ఈ మ్యాచ్ చివరి ఓవర్ మూడో బాల్ ను ధోనీ భారీ షాట్ కొట్టాడు. కానీ షాట్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో.. బంతి గాల్లోకి లేచింది. దీంతో నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న డార్లి మిచెల్ రన్ కోసం పరిగెత్తాడు. కానీ ధోని మాత్రం అతడిని వెనక్కి వెళ్లమన్నాడు. అయితే అప్పటికే అతడు ధోని వైపు క్రీజ్ లోకి వెళ్లి.. మళ్లీ తనవైపు తిరిగి వచ్చాడు. ఈలోపు ఫీల్డర్ బాల్ ను త్రో చేసినా వికెట్లకు తాగకపోవడంతో.. మిచెల్ రనౌట్ నుంచి తప్పించుకున్నాడు.
దీంతో మిచెల్ కు స్ట్రైకింగ్ ఇవ్వకపోవడంతో. ధోనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిచెల్ కు స్ట్రైకింగ్ ఇవ్వనందుకు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంత హిట్టరైనా అవతల ఉంది కూడా బ్యాటరే కదా స్ట్రైకింగ్ ఇవ్వాల్సింది. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ధోనిని స్వార్థపరుడు అంటూ తిట్టిపోస్తున్నారు. ఇర్ఫాన్ పఠాన్ లాంటి మాజీ ప్లేయర్స్ కూడా ధోనీ చేసింది సరైంది కాదని విమర్శించారు.