Ms Dhoni: ధోనీ.. నువ్వు ఆట కంటే గొప్పోడివి కాదు! గీత దాటడం మహేంద్రుడికి కొత్తేమీ కాదు..!

ఆట కంటే ఎవరూ ఎక్కువ కాదు. ఆ విషయాన్ని మరిచి కాలర్‌ మడిచి అంపైర్లతో గొడవకు పోతే ఎలా..? ఇలా చేయడం ధోనీకి ఫస్ట్‌ టైమ్‌ కాదు. గతంలో అనేకసార్లు ఇదే బిహేవియర్‌తో గ్రౌండ్‌లో లిమిట్‌ దాటాడు..!

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 25, 2023 | 09:39 AMLast Updated on: May 25, 2023 | 10:00 AM

Dhoni Unacceptable Act Slammed After Heated Chat With Umpires

Ms Dhoni: ధోనీ పెద్ద ఆటగాడే కావొచ్చు.. ప్రపంచం మెచ్చిన లీడరూ కావొచ్చు. అయితే ఆట కంటే ఎవరూ ఎక్కువ కాదు. ఆ విషయాన్ని మరిచి కాలర్‌ మడిచి అంపైర్లతో గొడవకు పోతే ఎలా..? ఇలా చేయడం ధోనీకి ఫస్ట్‌ టైమ్‌ కాదు. గతంలో అనేకసార్లు ఇదే బిహేవియర్‌తో గ్రౌండ్‌లో లిమిట్‌ దాటాడు..!
ఆట కంటే ఎవరూ గొప్ప కాదు. అది సచిన్‌ కావొచ్చు.. లారా కావొచ్చు.. ఆఖరికి డాన్‌ బ్రాడ్‌మాన్‌ కావొచ్చు..! వీళ్లంతా క్రికెట్‌పై చెరగని ముద్రవేసిన వాళ్లు..! ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉన్నవాళ్లు. గ్రౌండ్‌లో హూందాగా ప్రవర్తించిన వాళ్లు..! మైదానం బయట.. వెలుపలా కూడా ఆచితూచి మాట్లాడేవాళ్లు. కానీ కెప్టెన్‌ కూల్‌గా ప్రపంచ క్రికెట్‌ అభిమానులు గుర్తించిన ధోనీ మాత్రం అంపైర్ల విషయంలో అత్యంత వివాదాస్పదుడు. డగౌట్‌ నుంచి నేరుగా గ్రౌండ్‌లోకి వచ్చి అంపైర్‌తో గొడవ పడటం క్రికెట్‌ చరిత్రలో ధోనీకి మాత్రమే చెల్లింది. ఆ ఘటన జరిగి నాలుగేళ్లు దాటింది. ధోనీ ఐపీఎల్‌ కెరీర్‌ కూడా చివరి దశకు చేరుకుంది. కానీ అంపైర్ల విషయంలో మాత్రం అతని తీరులో ఏ మార్పులేదు.! గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌ ఇదే విషయాన్ని క్లియర్‌కట్‌గా మరోసారి నిరూపించింది.
రూల్స్‌కు ధోనీ అతీతుడా?
క్రికెట్‌లోనైనా.. ఇతర గేమ్స్‌లోనైనా రూల్‌ అందరికి రూలే. ధోనీ పైనుంచి దిగిరాలేదు. అంపైర్ల తప్పుడు నిర్ణయాలకు ఎన్నోసార్లు బలైన సచిన్‌, గిలిక్రిస్ట్‌ లాంటి ఆటగాళ్లే చిరునవ్వుతో గ్రౌండ్‌ని వీడేవాళ్లు. అయితే తప్పు తనవైపు ఉంచుకుని మరీ గ్రౌండ్‌లో అంపైర్లతో వాగ్వాదానికి దిగిన ఆటగాళ్ల లిస్ట్‌లో ధోనీ పేరు ఏకంగా ఆరుసార్లు ఉందంటే నమ్మగలరా? అభిమానం గుడ్డిదైతే కనపడకపోవచ్చు కానీ.. రెగ్యూలర్‌గా గేమ్‌ను ఫాలో అయ్యే నిజమైన క్రికెట్‌ లవర్స్‌కు మాత్రం గ్రౌండ్‌లో ధోనీ హద్దు మీరిన ఘటనలు ఎప్పటికీ గుర్తే ఉంటాయి. గుజరాత్‌పై మ్యాచ్‌లో ధోనీ ప్రవర్తనపై అన్నివైపుల నుంచి విమర్శలొస్తున్నాయి. అతనిపై ఓ మ్యాచ్‌ వేటు పడే అవకాశం కూడా ఉంది. మ్యాచ్‌ రిఫరీ ధోనీపై గుర్రుగా ఉన్నాడు.

గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ 16వ ఓవర్​ వేసేందుకు చెన్నై పేసర్ మతీష్ పతిరాణా సిద్దమయ్యాడు. కానీ అతడు బౌలింగ్ చేసేందుకు ఆన్‌ఫీల్డ్ అంపైర్లు క్రిస్ గఫానీ, అనిల్ చౌదరి నిరాకరించారు. ఆ ఓవర్ వేయడానికి ముందు పతిరాణా దాదాపు 9 నిమిషాల పాటు గ్రౌండ్‌లో లేడు. నేరుగా డగౌట్ నుంచి వచ్చిన పతిరాణాను బౌలింగ్ చేసేందుకు అంపైర్లు అనుమతించలేదు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. ఒక ఆటగాడు 8 నిమిషాల పాటు మైదానంలో లేకపోతే బౌలింగ్ లేదా బ్యాటింగ్​ చేయడం కుదరదు. అందుకే అంపైర్లు నిరాకరించారు. అయితే ధోని అలాంటివేం పట్టనట్లు.. అంపైర్ల వద్దకు వచ్చి వారితో వాగ్వాదానికి దిగుతాడు. చివరకు మొండిపట్టు పట్టి..అంపైర్లు వారిస్తున్నా.. పతిరాణాతో ఓవర్‌ వేయించేశాడు ధోనీ..! ఇదే తరహా తీరు కోహ్లీ చేసి ఉంటే అరిచి గగ్గొలు పెట్టేవాళ్లు. ధోనీ కాబట్టి కొంతమంది మాజీ ఆటగాళ్లు కళ్లు కనపడనట్టు ఉండిపోయారు.
రూల్స్‌ బ్రేక్‌ చేసి పతిరాణాతో బౌలింగ్‌ చేయించిన ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌లో సైతం అంపైర్లతో పలుమార్లు వాగ్వాదానికి దిగాడు. అయితే అక్కడ ఇలాంటి పప్పులు ఉడకవు కదా..సైలెంట్‌గా సైడ్‌ ఐపోవాల్సిందే..! ఐపీఎల్‌ మాత్రం ఏదో ధోనీ సొంత లీగ్‌ లాగా ఫీల్‌ అవుతున్నట్టున్నాడు. తాను కూడా ఓ ఆటగాడేనన్న విషయాన్ని మరిచినట్టున్నాడు. 2019లోనూ ఇలానే చేశాడు. నో బాల్‌ విషయంలో అంపైర్‌ రాంగ్‌ డిసిషన్‌ ఇచ్చాడంటూ డటౌట్‌ నుంచి నేరుగా గ్రౌండ్‌లోకి కాలర్‌ మడిచి ఎంట్రీ ఇచ్చాడు ధోనీ. ఇదేం సినిమా కాదు.. ప్రపంచ స్థాయి టీ20 లీగ్‌!

ధోని తన పవరేంటో.. తన వెనకున్న బలమేంటో చూపించిన ఘటన అది.! ధోనీకి బీసీసీఐ అండదండలు ఉండొచ్చు. అయితే లేనిది ఎవరికి..? ఒకప్పుడు కోహ్లీకి లేదా..? దాల్మియా టైమ్‌లో గంగూలీకి లేదా..? కోహ్లీ కూడా అంపైర్‌ నిర్ణయాలతో అనేక సార్లు విభేదించినా ఎప్పుడు కూడా లైన్‌ దాటలేదు. అతని పరిధిలోనే ప్రవర్తించాడు! 24ఏళ్లు పాటు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడిన సచిన్‌ అంపైర్ల తప్పుడు నిర్ణయాలకు 48సార్లు బలయ్యాడు. ఎప్పుడు కూడా నోరు జారి ఒక మాట కూడా అనలేదు.. అటు ద్రవిడ్‌, లక్ష్మణ్‌ది కూడా అదే తరహా ప్రవర్తన..! కానీ ధోనీ నైజం వేరు.. పైకే కెప్టెన్‌ కూల్‌..ఇన్‌సైడ్‌ యమ హాట్‌..!