రాజస్థాన్ ఫిక్సింగ్ చేసిందా ? క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ

ఐపీఎల్ 2025 సీజన్ లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ తో ఏప్రిల్ 19న జ‌రిగిన జ‌రిగిన మ్యాచ్ లో ఆర్ఆర్ 2 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 23, 2025 | 01:00 PMLast Updated on: Apr 23, 2025 | 1:00 PM

Did Rajasthan Commit Match Fixing Bcci Gives Clarity

ఐపీఎల్ 2025 సీజన్ లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ తో ఏప్రిల్ 19న జ‌రిగిన జ‌రిగిన మ్యాచ్ లో ఆర్ఆర్ 2 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. కాగా.. ఈ మ్యాచ్ ఫిక్సైంది అంటూ రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ తాత్కాలిక క‌న్నీన‌ర్ జైదీప్ బిహాని ఆరోపించడం సంచలనంగా మారింది. రెండు మ్యాచ్‌లలోనూ ఆఖరి ఓవర్‌లో తొమ్మిది పరుగులు చేయలేక రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయింది. దాంతో రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ కమిటీ కన్వీనియర్ జయదీప్ బిహానీ రాజస్థాన్ రాయల్స్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు చేశాడు. దీనిపై ఉన్నతస్థాయి విచరణ జరగాలంటూ ఓ దుమారాన్నే రేపాడు.ఈ ఆరోపణలు నెట్టింట పుట్టుకొచ్చిన గాసిప్స్ కాకపోవడం.. ఏకంగా రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ కమిటీ కన్వీనర్ నేరుగా చేయడంతో వాటికి అంత ప్రాధాన్యత వచ్చింది. అయితే ఈ ఆరోపణలపై బీసీసీఐ కూడా క్లారిటీ ఇచ్చింది.

ఫిక్సింగ్ ఆరోపణలపై బీసీసీఐ స్పందించింది. ఐపీఎల్‌పై తమ నిఘా ఎప్పుడూ ఉంటుందని, ఓ విభాగం కూడా ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తూనే ఉందని బీసీసీఐ చెప్పింది. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ చేసిన ఆరోపణలలో ఎలాంటి వాస్తవం లేదంటూ బీసీసీఐ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. ప్రత్యేకంగా బీసీసీఐ ఆ టీమ్‌ను నియమించి, ఎలాంటి తప్పులు జరగకుండా చూస్తోందని తెలిపింది. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ఆరోపించినట్లు ఎలాంటి మ్యాచ్ ఫిక్సింగ్‌లు జరగలేదనీ, ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని బీసీసీఐ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాకు వెల్లడించాయి.

రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ఈ ఆరోపణలు చేయడం వెనుక వేరే విషయం ఉందని తెలుస్తోంది. ఈ ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆరంభం నుంచే అంతగా రాణించలేదు. దాంతో రాజస్థాన్ మ్యాచ్‌లు వీక్షించే ప్రేక్షకులు తగ్గిపోయారు. సాధారణంగా రాజస్థాన్ మ్యాచ్‌లకు 1800 టికెట్లకు తగ్గకుండా అమ్ముడయ్యాయే.. కానీ ఇప్పుడు వెయ్యి నుంచి 1200 వరకే అమ్ముడుపోవడంతో ఇలాంటి ఆరోపణలు చేసినట్లు రాజస్థాన్ రాయల్స్ వర్గాలు చెబుతున్నాయి.