Smriti Mandhana dating : స్మృతి మంధాన ప్రేమలో పడిందా.. బాలీవుడ్ సెలబ్రిటీతో స్టార్ క్రికెటర్ డేటింగ్
భారత మహిళా క్రికెట్ (Indian Women Cricketer) జట్టు స్టార్ బ్యాటర్ (Star Batter) స్మృతి మంధాన (Smriti Mandhana) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మైదానంలో సొగసరి షాట్లతో బౌలర్లపై విరుచుకుపడే ఈ బ్యూటీఫుల్ క్రికెటర్‌కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అలాంటి ఫ్యాన్స్ గుండెలు త్వరలోనే బద్దలవ్వనున్నాయి.

Did Smriti Mandhana fall in love.. Star cricketer dating a Bollywood celebrity
భారత మహిళా క్రికెట్ (Indian Women Cricketer) జట్టు స్టార్ బ్యాటర్ (Star Batter) స్మృతి మంధాన (Smriti Mandhana) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మైదానంలో సొగసరి షాట్లతో బౌలర్లపై విరుచుకుపడే ఈ బ్యూటీఫుల్ క్రికెటర్‌కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అలాంటి ఫ్యాన్స్ గుండెలు త్వరలోనే బద్దలవ్వనున్నాయి. సోలో లైఫ్‌కు స్మృతి టాటా చెప్పనుంది. ఓ బాలీవుడ్ (Bollywood) ప్రముఖుడితో కలిసి ఆమె ఏడడుగులు నడవనుంది. గత కొన్ని రోజులుగా స్మృతి ప్రేమ, పెళ్లి విషయాలతో తరచూ వార్తల్లో నిలుస్తోంది . ప్రముఖ బాలీవుడ్ గాయకుడు పాలక్ ముచ్చల్ సోదరుడు పలాష్ ముచ్చల్‌తో మంధాన డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరగుతోంది. ఈ లవ్ బర్డ్స్ పలు సందర్భాల్లో జోడీగా కనిపించారు.
బీసీసీఐ వార్షిక అవార్డుల్లో స్మృతి మంధాన ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ పురస్కారం అందుకుంది.ఈ నేపథ్యంలో పలాష్ ముచ్చల్ స్మృతికి ఇన్‌స్టాగ్రామ్‌లో శుభాకాంక్షలు తెలిపాడు. ఇప్పుడే కాదు గతంలోనూ సోషల్ మీడియా వేదికగా ఇద్దరూ ఒకరికొకరు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పుకున్నారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోనున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. స్మృతి మందన్నాకు మద్దతుగా పలాష్ ముచ్చల్ తరచుగా మ్యాచ్‌లు చూడటానికి స్టేడియానికి వస్తుంటాడు. ఇక స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ కుటుంబాలు కూడా చాలా సందర్భాలలో కలిసి కనిపించాయి. దీంతో వీరి ప్రేమకు పెద్దలు కూడా ఆశీర్వదించారని ,ఇక పెళ్లే తరువాయి అని బాలీవుడ్ మీడియా సర్కిళ్లలో టాక్ వినిపిస్తోంది.