Rohith Sharma: సెలెక్షన్ కమిటీలో ఒక్కడికి తెలివి లేదు అంత డబ్బును ఏం చేసుకుంటారు?

ఓవల్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో 209 పరుగుల తేడాతో టీమిండియా ఘోర ఓటమి చవి చూసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి భారత జట్టుపై విమర్శల వర్షం కురుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 19, 2023 | 03:54 PMLast Updated on: Jun 19, 2023 | 3:54 PM

Dilip Veng Sarkar Has Made Important Comments On The Indian Cricket Select Committee And Said That It Works Only With The Aim Of Making Money

ముఖ్యంగా జట్టు కెప్టెన్సీపై పెద్ద ఎత్తున చర్చనడుస్తోంది. రోహిత్‌ను తప్పించి మరోక ఆటగాడికి జట్టు పగ్గాలు అప్పజెప్పాలని చాలా మంది మాజీలు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఇప్పటిలో రోహిత్‌ కెప్టెన్సీకి వచ్చిన డోకా ఏమీ లేదు. ఈ ఏడాది భారత్‌ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌ తర్వాత టీమిండియా కెప్టెన్సీపై బీసీసీఐ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో భారత మాజీ క్రికెటర్‌ దిలీప్ వెంగ్‌సర్కార్ కీలక వాఖ్యలు చేశాడు.

“భారత సెలక్షన్‌ కమిటీ ఉన్న సెలెక్టర్లకు క్రికెట్‌పై కనీస అవహగన, ముందు చూపు లేనట్లుగా అనిపిస్తోంది. గత ఆరు-ఏడేళ్లుగా ఇదే నేను చూస్తున్నాను. వారు కొన్ని సిరీస్‌లలో ప్రధాన ఆటగాళ్లు అందుబాటులో లేనప్పుడు శిఖర్ ధావన్‌ను భారత కెప్టెన్‌గా చేసారు. అదే వారు చేసిన తప్పు. ఇటువంటి సమయంలోనే యువ ఆటగాళ్లలో ఎవరో ఒకరికి జట్టు పగ్గాలు అప్ప జెప్పి ఫ్యూచర్‌ కెప్టెన్‌లను తయారు చేయాలి. కానీ బీసీసీఐ ఆ పని చేయలేదు.

రోహిత్‌ తర్వాత భారత కెప్టెన్‌ను తయారు చేయడంలో బీసీసీఐ విఫలమైంది. పేరుకే ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు. అంతేతప్ప కనీసం బెంచ్‌ బలాన్ని పెంచుకోవడం లేదు. కేవలం ఐపీఎల్ నిర్వహించడం, మీడియా హక్కుల ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించడం మాత్రమే కాదు.. జట్టును తీర్చిదిద్దడంపై కూడా దృష్టిసారించాలి” అంటూ బీసీసీఐపై వెంగ్‌సర్కార్ విమర్శల వర్షం కురిపించాడు.