నన్ను క్షమించండి ధోనీ ఫ్యాన్స్ కు డీకే సారీ
టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ధోనీ ఫ్యాన్స్ ను క్షమాపణలు కోరాడు. ధోనీ విషయంలో తాను పెద్ద తప్పు చేశానంటూ అపాలజీ చెప్పాడు. ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అన్ని ఫార్మాట్లలో కలిపి ఇండియా ఆల్‌టైమ్ ఎలెవన్ ను డీకే ప్రకటించాడు.
టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ధోనీ ఫ్యాన్స్ ను క్షమాపణలు కోరాడు. ధోనీ విషయంలో తాను పెద్ద తప్పు చేశానంటూ అపాలజీ చెప్పాడు. ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అన్ని ఫార్మాట్లలో కలిపి ఇండియా ఆల్‌టైమ్ ఎలెవన్ ను డీకే ప్రకటించాడు. అయితే కార్తీక్ ఆల్‌టైమ్ ఎలవెన్‌లో ధోనీ పేరు లేదు. దేశానికి రెండు ప్రపంచకప్ లు అందించిన గొప్ప కెప్టెన్ ను , ధోనీ లాంటి ఫినిషర్ ను ఎలా మరిచిపోతాడంటూ చాలా మంది ఫ్యాన్స్ ఫైరయ్యారు. ధోనీతో ఉన్న విభేదాల కారణంగానే దినేశ్ కార్తీక్ ఇలా చేశాడన్న అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో దినేశ్ కార్తీక్ తాను ప్రకటించిన జట్టు గురించి వివరణ ఇచ్చాడు. తన జట్టులో వికెట్ కీపర్ స్థానాన్నే మర్చిపోయానని, అందరూ రాహుల్ ద్రవిడ్‌ను వికెట్ కీపర్‌గా ఎంపిక చేశానని అనుకున్నారని డీకే అన్నాడు
పొరపాటు జరిగిందన్న విషయం ఎపిసోడ్ రిలీజ్ తర్వాతే తనకు అర్థమైందని చెప్పాడు. వికెట్ కీపర్‌ను అయిన తాను.. వికెట్ కీపర్ ఎంపికను మర్చిపోయాననడం పెద్ద పొరపాటుగా అభిప్రాయపడ్డాడు. భారత్ లోనే కాదు ప్రపంచ క్రికెట్ లో ఉన్న గొప్ప క్రికెటర్లలో ధోనీ ఒకడన్నాడు. ఇక ఆల్‌టైమ్ జట్టును మళ్లీ ప్రకటించాల్సి వస్తే తాను ధోనీనే వికెట్ కీపర్ సెలక్ట్ చేస్తానని చెప్పాడు . ఏ భారత జట్టుకు అయినా అతనే కెప్టెన్ గా ఉంటాడని తేల్చేశాడు.