Dinesh Karthik : కోచ్ గా దినేశ్ కార్తీక్.. మాజీ ప్లేయర్ కు ఆర్సీబీ ఆఫర్
టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సారి ప్లేయర్ కాదు మెంటార్ కప్ బ్యాటింగ్ కోచ్ గా... ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ డీకేను తన కోచింగ్ స్టాఫ్ లోకి తీసుకుంది.
టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సారి ప్లేయర్ కాదు మెంటార్ కప్ బ్యాటింగ్ కోచ్ గా… ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ డీకేను తన కోచింగ్ స్టాఫ్ లోకి తీసుకుంది. వచ్చే సీజన్ నుంచి దినేశ్ కార్తీక్ బ్యాటింగ్ కోచ్ , మెంటార్ గా వ్యవహరిస్తాడని ప్రకటించింది. ఐపీఎల్ 17వ సీజన్ ప్లే ఆఫ్స్ ముగిసిన తర్వాత దినేశ్ కార్తీక్ ఆటకు గుడ్ బై చెప్పాడు. జాతీయ జట్టుకు దూరమైన తర్వాత ఐపీఎల్ లో కొనసాగిన డీకే సంచలన ప్రదర్శనతో మళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే కుర్రాళ్ళ నుంచి పోటీ ఉండడంతో క్రమంగా మళ్ళీ దూరమయ్యాడు.
ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించిన డీకే 257 మ్యాచ్ లు ఆడాడు. అలాగే ఓవరాల్ గా భారత తరపున 26 టెస్టులు, 94 వన్డేలు, 60 టీ ట్వంటీలు ఆడాడు. కాగా రిటైర్మెంట్ తర్వాత కామెంటేటర్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఆర్ సీబీకి కొత్త రోల్ లో పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు దినేశ్ కార్తీక్ చెప్పాడు.