ఇంగ్లాండ్ కు డూ ఆర్ డై ఆఫ్ఘన్ పై ఓడితే ఇంటికే
ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లు రసవత్తరంగా సాగుతున్నాయి. గ్రూప్ ఏ సెమీఫైనలిస్టులు తేలిపోగా... గ్రూప్ బిలో మాత్రం రేసు రసవత్తరంగా మారింది. వర్షం కారణంగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మ్యాచ్ రద్దవడంతో ఆ గ్రూపులో నాలుగు జట్లకూ సెమీస్ అవకాశాలు ఉన్నాయి.

ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లు రసవత్తరంగా సాగుతున్నాయి. గ్రూప్ ఏ సెమీఫైనలిస్టులు తేలిపోగా… గ్రూప్ బిలో మాత్రం రేసు రసవత్తరంగా మారింది. వర్షం కారణంగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మ్యాచ్ రద్దవడంతో ఆ గ్రూపులో నాలుగు జట్లకూ సెమీస్ అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ , ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు సెమీస్ లో రేసులో నిలిస్తే… ఓడిన జట్టు ఇంటిదారి పడుతుంది. ఒకవిధంగా చెప్పాలంటే ఇంగ్లాండ్ టీమ్ కు ఇది డూ ఆర్ డై మ్యాచ్ గా చెప్పాలి,. ఎందుకంటే తొలి మ్యాచ్ లో 350కి పైగా భారీస్కోరు చేసినా కాపాడుకోలేకపోయింది. దీంతో అఫ్గానిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ఇంగ్లండ్ సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఓడితే లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. సెమీస్ చేరాలంటే చివరి రెండు మ్యాచ్‌లను మెరుగైన రన్‌రేట్‌తో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మరోవైపు అఫ్గానిస్థాన్ పరిస్థితి కూడా అదే. సౌతాఫ్రికాతో తొలి మ్యాచ్‌లో ఆ జట్టు చిత్తుగా ఓడింది. ఈ క్రమంలోనే ఈ రెండు జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. గ్రూప్-బీలో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా టాప్-2లో కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ బౌలర్లు ఇంకా గాడిన పడలేదు. భారత్ తో సిరీస్ లో చేతులెత్తేసిన ఇంగ్లీష్ టీమ్ పేసర్లు మెగాటోర్నీలోనూ నిరాశపరుస్తున్నారు. బౌలర్ల వైఫల్యంతోనే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 352 పరుగుల లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయింది. దీంతో బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్ అందుకోవడంపైనే ఆ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.. బౌలింగ్ ఆల్‌రౌండర్ బ్రైడన్ కార్స్ గాయంతో టోర్నీ నుంచి తప్పుకోవడం ఆ జట్టుకు ఎదురు దెబ్బే. అతని స్థానంలో లెగ్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్‌ను జట్టులోకి తీసుకున్నారు.
బెన్ డకెట్, జోరూట్ సూపర్ ఫామ్‌లో ఉండగా.. ఫిల్ సాల్ట్, బట్లర్, హ్యారీ బ్రూక్ కూడా రాణిస్తే ఆ జట్టుకు తిరుగుండదు. బౌలింగ్ లో జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్ రాణిస్తేనే ఆ జట్టుకు విజయాలు దక్కనున్నాయి. స్పిన్ విభాగంలో ఆదిల్ రషీద్ కీలకం కానున్నాడు. మరోవైుు ఆప్ఘనిస్తాన్ ను కూడా తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. ఆ జట్టును ఏ మాత్రం తక్కువ అంచనా వేసినా ఇంగ్లండ్ మూల్యం చెల్లించుకుంటుంది. గత ఏడాది టీ20 ప్రపంచకప్ లో ఆసీస్‌ను ఓడించి అఫ్గాన్ సెమీస్ చేరింది. అఫ్గాన్ బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉన్నా.. బ్యాటింగ్ లైనప్ బలహీనంగా ఉంది. ఏది ఏమైనా ఇంగ్లండ్‌కు అఫ్గాన్ గట్టి పోటీనిచ్చే అవకాశాలున్నాయి. పైగా ఆప్ఘన్ పై ఒత్తిడి లేకపోవడం కూడా ఆ జట్టుకు అడ్వాంటేజ్ గా చెప్పొచ్చు.