నీకు బుద్ధుందా…స్టుపిడ్ పంత్ పై గవాస్కర్ ఫైర్
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ పై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు. మెల్ బోర్న్ టెస్టులో పంత్ ఔటైన విధానంతో గవాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. స్టుపిడ్ లా ఆడావంటూ మండిపడ్డాడు. ఒక చెత్త షాట్ అంటూ తిట్టిపోశాడు.
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ పై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు. మెల్ బోర్న్ టెస్టులో పంత్ ఔటైన విధానంతో గవాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. స్టుపిడ్ లా ఆడావంటూ మండిపడ్డాడు. ఒక చెత్త షాట్ అంటూ తిట్టిపోశాడు. గవాస్కర్ ఈ రేంజ్ లో కోప్పడడం ఇదే తొలిసారి కావొచ్చు. నిజానికి ఈ మ్యాచ్ లో పంత్ ఔట్ ఒకవిధంగా జట్టును కష్టాల్లోకి నెట్టింది. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో బాధ్యతగా ఆడి ఆదుకోవాల్సిన పంత్ ర్యాంప్ షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. వింత వింత షాట్స్ ఆడి పరుగులు రాబట్టడమనేది అతని శైలి అయినప్పటికీ.. బాక్సింగ్ డే టెస్టులో పంత్ ఔటైన తీరు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఒకరకంగా అత్యుత్సాహంతోనే వికెట్ సమర్పించుకున్నాడు.
6 ఓవర్‌లో బోలాడ్ వేసిన బంతిని స్కూప్ షాట్ ఆడబోయిపంత్ థర్డ్ మ్యాన్ గా ఉన్న నాథన్ లయన్ కు క్యాచ్ ఇచ్చాడు. స్కూప్ షాట్ ఆడటం పంత్‌కు అలవాటే కానీ అంతకుముందు బాల్ కూడా ఇలాంటి షాట్ ఆడబోయి మిస్ అయ్యాడు. మళ్ళీ అదే తరహా షాట్ ఆడే ప్రయత్నం చేయడం కొంపముంచింది. బంతి ఎడ్జ్ తీసుకొని డీప్ థర్డ్ మ్యాన్ పొజిషన్‌లో ఉన్నలయాన్ చేతుల్లో పడింది. అప్పటికి టీమిండియాకు ఇంకా ఫాలోఆన్ గండం ఎదురుచూస్తోంది. ఇవేమి ఆలోచించని పంత్ అనవసరంగా వికెట్ పారేసుకున్నాడు. పంత్ ఇలాంటి షాట్లు ఆడతాడని తెలిసే ఆసీస్ ఫీల్డింగ్ సెటప్ ను చాలా తెలివిగా ప్లాన్ చేసింది. చివరికి అదే ట్రాప్ లో చిక్కిన పంత్ అందరి ఆగ్రహానికి గురయ్యాడు.
పంత్ వికెట్‌పై సునీల్ గవాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టుపిడ్, స్టుపిడ్, స్టుపిడ్.. ఇది మూర్ఖత్వం కాదు, అంతకుమించి అంటూ తీవ్ర వ్యాఖ్యలతో మండిపడ్డాడు.అక్కడ ఫీల్డింగ్ సెటప్ చూసి కూడా అలాంటి షాట్ ఆడావంటే నిన్ను ఏం అనాలో అర్థం కావడం లేదంటూ ఫైర్ అయ్యాడు. ఇది నీ న్యాచురల్ గేమ్ కాదంటూ విమర్శించాడు. అటు మరో కామెంటేటర్ హర్షా భోగ్లే సైతం పంత్ వికెట్ పై అసహనం వ్యక్తం చేశాడు. నిజానికి ఈ సిరీస్ లో పంత్ ప్రదర్శన స్థాయికి తగినట్టు లేదు. గత టూర్ లో తన సంచలన బ్యాటింగ్ తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అందించిన ఈ యువ వికెట్ కీపర్ ఈసారి మాత్రం నిరాశపరిచాడు. పైగా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఇలాంటి రీతిలో ఔటవడంతో మరిన్ని విమర్శలు ఎదుర్కొంటున్నాడు.