ధోనీతో అప్పుడే పోల్చొద్దు పంత్ కు ఇంకా టైముందన్న డీకే
629 రోజుల తర్వాత టెస్ట్ క్రికెట్ లోకి రీఎంట్రీ ఇచ్చి సెంచరీతో దుమ్మురేపిన భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. క్లిష్ట పరిస్థితుల్లో శతకం సాధించిన పంత్ ను చాలా మంది మాజీ కెప్టెన్ ధోనీతో పోలుస్తున్నారు.
629 రోజుల తర్వాత టెస్ట్ క్రికెట్ లోకి రీఎంట్రీ ఇచ్చి సెంచరీతో దుమ్మురేపిన భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. క్లిష్ట పరిస్థితుల్లో శతకం సాధించిన పంత్ ను చాలా మంది మాజీ కెప్టెన్ ధోనీతో పోలుస్తున్నారు. దీనిపై మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ స్పందించాడు. అప్పుడే ధోనీతో పంత్‌ను పోల్చడం సరికాదన్నాడు. ధోనీ కెరీర్ ముందు రిషభ్ పంత్ చాలా చిన్నోడని అభిప్రాయపడ్డాడు.రిషభ్ పంత్ కేవలం 34 టెస్ట్‌లు మాత్రమే ఆడాడనీ, ధోనీ ఇప్పటికే అత్యుత్తమ వికెట్ కీపర్‌గా గుర్తింపు పొంది ఆటకు వీడ్కోలు పలికాడని గుర్తు చేశాడు. ధోనీ స్థాయికి చేరుకునేందుకు పంత్‌కు ఇంకా సమయం ఉందన్నాడు. ఇప్పుడే ఓ నిర్ణయానికి రావడం సరికాదని, అయితే పంత్ ఇలానే ఆడితే మాత్రం భవిష్యత్తులో అత్యుత్తమ వికెట్ కీపర్‌గా మారతాడనడంలో ఎలాంటి సందేహం లేదని డీకే అంచనా వేశాడు.
ధోనీ కేవలం కీపింగ్‌లోనే కాకుండా.. బ్యాటర్‌గానూ విలువైన ఇన్నింగ్స్ లు ఆడాడని దినేశ్ కార్తీక్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడే ధోనీతో పోల్చి చూసి అతనిపై ఒత్తిడి పెంచొద్దని డీకే సూచించాడు. కాగా చెన్నై టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో పంత్ అదరగొట్టాడు. గిల్ తో కలిసి కీలక పార్టనర్ షిప్ నెలకొల్పిన పంత్… ధోనీ టెస్ట్ శతకాల రికార్డ్‌ను సమం చేశాడు. దీంతో భారత్ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక శతకాలు నమోదు చేసిన వికెట్ కీపర్లుగా ఈ ఇద్దరూ సమంగా నిలిచారు. ఈ రికార్డ్‌కు ధోనీ ఎక్కువ ఇన్నింగ్స్‌లు తీసుకోగా.. పంత్ మాత్రం అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించాడు.