Anushka Sharma, Virat Kohli : రెండో బిడ్డ కోసం వెయిటింగ్ ..
బాలీవుడ్ (Bollywood) నటి అనుష్క శర్మ (Anushka Sharma) , టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) దంపతులు మరో బిడ్డకు జన్మనివబోతున్నారని గతంలో వార్తలు వచ్చాయి. వారిద్దరూ తమ రెండవ బిడ్డ గురించి అసలు విషయం రివీల్ చేస్తారని చాలారోజుల నుంచి వారి అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Bollywood, actress, Anushka Sharma, Team India, cricketer, Virat Kohli,
బాలీవుడ్ (Bollywood) నటి అనుష్క శర్మ (Anushka Sharma) , టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) దంపతులు మరో బిడ్డకు జన్మనివబోతున్నారని గతంలో వార్తలు వచ్చాయి. వారిద్దరూ తమ రెండవ బిడ్డ గురించి అసలు విషయం రివీల్ చేస్తారని చాలారోజుల నుంచి వారి అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ వారు ఇప్పటి వరకు అధికారికంగా ఆ విషయంపై ఎక్కడా ప్రకటించలేదు. తాజాగా అనుష్క తన భర్త విరాట్‌తో కలిసి ఒక హోటల్ వెలుపల నడుస్తూ కెమెరాలకు కనిపించారు. అనుష్క తన బేబీ బంప్‌పై చేతులు ఉంచి నడుస్తూ ఉన్నారు. అందులో ఆమె బేబీ బంప్ చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతుంది.
Pushpa 2 : పుష్ప – 2లో ఈ సారి ఊ అంటావా కు మించిన ఐటెం సాంగ్..
దీంతో విరాట్- అనుష్క అభిమానులు దానిని షేర్ చేస్తూ అభినందనలు తెలుపుతున్నారు. అనుష్క శర్మ రెండోసారి ప్రెగ్నెంట్ అని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. కొన్నిరోజుల క్రితం ఈ జంట ముంబైలోని ఓ గైనకాలజీ క్లినిక్‌కు వెళ్లారు. ఎందుకు వచ్చామనే విషయంపై త్వరలోనే ప్రకటన చేస్తామని చెప్పి ఫొటోలు తీయొద్దని కోహ్లి మీడియాను అభ్యర్థించారు.