HYDERABAD: తెలంగాణ ఎన్నికల వేడి.. హైదరాబాద్‌ క్రికెట్ మ్యాచ్ వేదిక మార్పు..?

వరల్డ్ కప్ ముగిసిన వెంటనే ఆస్ట్రేలియా జట్టుతో టీమిండియా ఐదు టీ 20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈనెల 19న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగునుంది. వరల్డ్ కప్ ముగియగానే ఆసీస్‌‌తో టీ 20 సిరీస్‌కు భారత్ సన్నద్ధం కానుంది. ఐదు టీ20 మ్యాచుల్లో నవంబర్ 23న మొదటి టి20 మ్యాచ్ వైజాగ్‌లో జరగనుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 9, 2023 | 05:02 PMLast Updated on: Nov 09, 2023 | 5:02 PM

Election Effect On Cricket Ind Vs Aus Match In Hyderabad Cancelled

HYDERABAD: తెలంగాణ ఎన్నికల ఎఫెక్ట్ క్రికెట్ మీద పడింది. తెలంగాణ ఎన్నికల పోలింగ్‌ నవంబర్ 30 ముగియనుంది. ఆ తర్వాత డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే వరల్డ్ కప్ ముగియగానే ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. వన్డే వరల్డ్ కప్‌కి ముందు టీమిండియాతో ఆస్ట్రేలియా 3 వన్డే మ్యాచ్‌లు ఆడింది. వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఇరు జట్ల మధ్య ఐదు టీ 20 మ్యాచ్‌లు నిర్వహించేందుకు రెండు బోర్డులు నిర్ణయించుకున్నాయి.

REVANTH REDDY: కాంగ్రెస్ నేతలపైనే ఐటీ దాడులా..? బీఆర్ఎస్, బీజేపీ నేతలపై ఎందుకు జరగవు: రేవంత్ రెడ్డి

దీంతో వరల్డ్ కప్ ముగిసిన వెంటనే ఆస్ట్రేలియా జట్టుతో టీమిండియా ఐదు టీ 20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈనెల 19న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగునుంది. వరల్డ్ కప్ ముగియగానే ఆసీస్‌‌తో టీ 20 సిరీస్‌కు భారత్ సన్నద్ధం కానుంది. ఐదు టీ20 మ్యాచుల్లో నవంబర్ 23న మొదటి టి20 మ్యాచ్ వైజాగ్‌లో జరగనుంది. అయితే ఐదో టీ 20 డిసెంబర్ 3న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ నిర్వహించేందుకు బీసీసీఐ షెడ్యూల్ ప్రకటించింది. అయితే అదే తేదీన తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో పోలీసులు మొత్తం కౌంటింగ్ సెంటర్ల వద్ద బందోబస్తుగా ఉండాల్సి ఉంటుంది.

దీంతో ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగే చివరి టీ20 మ్యాచ్‌కు తాము భద్రత కల్పించలేమని ఇప్పటికే రాచకొండ పోలీసులు బీసీసీఐకి స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. దీనిపై ఇంకా బీసీసీఐ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడనప్పటికీ పోలీసులు భద్రత కల్పించలేమని స్పష్టం చేశారు. దీనిపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.