ఇది కదా ఫీల్డింగ్ సెటప్.. బ్యాటర్ చుట్టూ మొత్తం ఫీల్డర్లు

ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ అద్భుతమైన మ్యాచ్ లకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటుంది. అందుకే ఈ మ్యాచ్ లకు అక్కడ విపరీతమైన క్రేజ్..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 13, 2024 | 05:20 PMLast Updated on: Sep 13, 2024 | 6:48 PM

England County Cricket Fielding Setup

ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ అద్భుతమైన మ్యాచ్ లకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటుంది. అందుకే ఈ మ్యాచ్ లకు అక్కడ విపరీతమైన క్రేజ్.. తాజాగా సోమర్‌సెట్ , సర్రే జట్ల మధ్య మ్యాచ్‌ చివరి నిమిషం వరకూ సాగిన మ్యాచ్‌ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. చివరి 5 నిమిషాల్లో అరుదైన దృశ్యం కనిపించింది. సర్రేను ఆలౌట్ చేసేందుకు సోమర్ సెట్ కెప్టెన్ అద్భుతమైన ఫీల్డింగ్ ను సెటప్ చేశాడు. మొత్తం 9 మంది ఫీల్డర్లనూ బ్యాటర్ చుట్టూనే మోహరించాడు. సోమర్ సెట్ బౌలర్ లీచ్‌ వేసిన ఆ బంతిని బ్యాటర్ వార్రల్ అడ్డుకొనేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి ప్యాడ్లను తాకడం… అంపైర్‌ ఔట్‌ ఇవ్వడంతో సర్రే 111 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ సందర్భంగా ఇద్దరు బ్యాటర్లతో కలిపి సోమర్‌సెట్‌కు చెందిన 11 మంది ప్లేయర్లూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.