ఇంగ్లాండ్ క్రికెటర్ షాకింగ్ డెసిషన్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై
ప్రపంచ వ్యాప్తంగా టీ ట్వంటీ లీగ్స్ హవా పెరుగుతున్న వేళ ఆటగాళ్ళు కూడా వాటివైపే ఆసక్తి చూపుతున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా టీ ట్వంటీ లీగ్స్ హవా పెరుగుతున్న వేళ ఆటగాళ్ళు కూడా వాటివైపే ఆసక్తి చూపుతున్నారు. దీని కోసం అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పేస్తున్నారు. తాజాగా ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ డేవిడ్ మలాన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇంగ్లండ్‌కు ఆడాలనే తన కల నెరవేరినందుకు సంతోషంగా ఉందని.. ఈ జర్నీలో తనకు సహకరించిన వారందరికీ మలాన్ థ్యాంక్స్ చెప్పాడు. 2017లో సౌతాఫ్రికాపై అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన మలాన్ ఏడేళ్ల కెరీర్లో 22 టెస్టులు ఆడాడు. 30 వన్డేల్లో 1450 పరుగులు, 62 టీ ట్వంటీల్లో 1892 పరుగులు సాధించాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 8 సెంచరీలు చేశాడు.