లంకపై శతక్కొట్టిన రూట్ రోహిత్ రికార్డ్ బ్రేక్

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ క్రికెటర్ జో రూట్ సెంచరీతో దుమ్మురేపాడు. రూట్ కెరీర్ లో ఇది 49 టెస్ట్ సెంచరీ.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 30, 2024 | 04:48 PMLast Updated on: Aug 30, 2024 | 4:53 PM

England Cricketer Joe Roots Century

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ క్రికెటర్ జో రూట్ సెంచరీతో దుమ్మురేపాడు. రూట్ కెరీర్ లో ఇది 49 టెస్ట్ సెంచరీ. ఈ క్రమంలో అతను అరుదైన ఘనత సాధించాడు. ప్రస్తుత యాక్టివ్ క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు సాధించిన రెండో ఆటగాడిగా రూట్ చరిత్రకెక్కాడు. అంతకుముందు ఈ ఘనత రోహిత్ పేరిట ఉండేది. తాజాగా ఈ రికార్డును రూట్అ బ్రేక్ చేశాడు. ఇక ఇదే జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు ఇంగ్లండ్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా అలిస్టర్ కుక్‌తో రూట్ సమంగా నిలిచాడు. రూట్ ఈ రికార్డు శతకాన్ని తన మాజీ బ్యాటింగ్ మెంటార్, స్నేహితుడు గ్రహమ్ థోర్ప్‌కు అంకితం చేశాడు. కాగా తొలి రోజు ఆట ముగిసేసరికి ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లకు 358 పరుగులు చేసింది.