IND Vs ENG: మూడో టెస్టుకు ముందే ఇండియా నుంచి వెళ్లిపోతున్న ఇంగ్లండ్ జట్టు.. కారణం ఇదే..
మూడో టెస్టుకు దాదాపు పది రోజుల సమయం ఉంది. అందువల్ల ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జట్టు భావిస్తోంది. ఈ పది రోజుల టైమ్‌లో ఆటగాళ్లు రిలాక్స్ అవుతారు. అలాగే.. మూడో టెస్టు కోసం సన్నద్ధం కావచ్చని ఇంగ్లాండ్ టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
IND Vs ENG: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐటు టెస్టుల సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు టెస్టులు పూర్తయ్యాయి. రెండు జట్లూ చెరో మ్యాచ్ గెలిచి, సిరీస్ సమంగా ఉంది. మూడో టెస్టు ఈ నెల 15 నుంచి రాజ్‌కోట్‌లో జరగనుంది. అయితే, మూడో టెస్టుకు ముందే ఇంగ్లండ్ జట్టు భారత్ విడిచి వెళ్లనుంది. అలాగని టెస్టు సిరీస్ రద్దు చేసుకుని, జట్టు వెళ్లిపోవడం లేదు. దీనికో కారణం ఉంది. ఇంగ్లండ్ జట్టు వెళ్తోంది స్వేదేశానికి కాదు. అబుదాబీకి.
REVANTH REDDY VS KCR: దక్షిణ తెలంగాణకు బీఆర్ఎస్ అన్యాయం అసెంబ్లీలో ఎదురుదాడికి కాంగ్రెస్ ప్లాన్
మూడో టెస్టుకు దాదాపు పది రోజుల సమయం ఉంది. అందువల్ల ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జట్టు భావిస్తోంది. ఈ పది రోజుల టైమ్‌లో ఆటగాళ్లు రిలాక్స్ అవుతారు. అలాగే.. మూడో టెస్టు కోసం సన్నద్ధం కావచ్చని ఇంగ్లాండ్ టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. విశ్రాంతి తీసుకోవడంతోపాటు, గేమ్ ప్లాన్ రూపొందించుకుంటారు. అబుదాబీలో ఇంగ్లాండ్ క్రికెటర్లు గోల్ఫ్ ఆడటంతోపాటు, ఇతర రీక్రియేషనల్ యాక్టివిటీస్‌లో పాల్గొంటారు. ఫలితంగా తమ జట్టు ఆటగాళ్లు మూడో టెస్టులో ఉత్సాహంగా ఆడుతారని జట్టు యాజమాన్యం భావిస్తోంది. నిజానికి రెండు టెస్టుల మధ్య ఇంత గ్యాప్ దొరకడం చాలా అరుదు. అందుకే ఈ టైంను విదేశాలకు వెళ్లి సద్వినియోగం చేసుకోవాలనేది ఇంగ్లండ్ జట్టు ఆలోచన. సాధారణంగా.. ఏ జట్టైనా విదేశీ టోర్నమెంట్ ఆడాలంటే.. ముందుగానే వెళ్లి ప్రాక్టీస్ మ్యాచులు ఆడి, అక్కడి వాతావరణం, పిచ్‌లకు అలవాటు పడతారు. కానీ, ఇంగ్లాండ్ జట్టు మాత్రం టెస్టు సిరీస్ ప్రారంభానికి ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడేందుకు భారత్‌కి రాలేదు.
దీని బదులు అబుదాబీలో ఎక్స్‌టెన్సివ్ కండీషనింగ్ క్యాంప్ ఏర్పాటు చేసి తీవ్రంగా సాధన చేసింది. అబుదాబీ క్యాంప్ ద్వారా భారత స్పిన్నర్లను ఎలా ఎదుర్కోవాలనే విషయమై ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఎక్కువ సమయం ప్రాక్టీస్ చేశారు. ఇక.. ఇంగ్లండ్ చివరిసారిగా 2012లో అలెస్టర్ కుక్ సారథ్యంలో, భారత గడ్డ మీద టెస్టు సిరీస్ గెలిచింది. 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు టైటిల్ గెలిచే అవకాశం ఉందని ఇంగ్లాండ్ టీమ్ భావిస్తోంది. అందుకే సీరియస్‌గా ప్రయత్నిస్తోంది. 2013 తర్వాత భారత జట్టు సొంత గడ్డ మీద ఇప్పటి వరకూ నాలుగు టెస్టుల్లోనే ఓడిపోయింది. అందుకే ఈసారి ఎలాగైనా ఇక్కడ జరుగుతున్న సిరీస్ గెలవాలని పట్టుదలగా ఉంది.