రూ.20 లక్షలు కూడా ఎక్కువే ,వెంకటేశ్ అయ్యర్ పై కేకేఆర్ ఫ్యాన్స్ ఫైర్
ఐపీఎల్ అంటేనే కమర్షియల్ లీగ్... ప్రతీ అంశం డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. అందుకే ఇక్కడ భారీ ధర దక్కించుకుని పెద్దగా ఆడని ప్లేయర్స్ ఖచ్చితంగా విమర్శలు ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి.

ఐపీఎల్ అంటేనే కమర్షియల్ లీగ్… ప్రతీ అంశం డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. అందుకే ఇక్కడ భారీ ధర దక్కించుకుని పెద్దగా ఆడని ప్లేయర్స్ ఖచ్చితంగా విమర్శలు ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. గత ఏడాది జరిగిన మెగా వేలంలో పంత్ , శ్రేయాస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్ లు రికార్డు ధర పలికారు. కానీ పంత్, వెంకటేశ్ అయ్యర్ మాత్రం తమపై ఉన్న అంచనాలను అందుకోలేకపోతున్నారు. తాజాగా ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లోనూ వెంకటేశ్ అయ్యర్ నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో9 బంతులు ఎదుర్కొన్న అయ్యర్ కేవలం 3 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనూ అయ్యర్ విఫలమయ్యాడు. ఆర్సీబీపై కేవలం 6 పరుగులు మాత్రమే చేశాడు. ఆల్‌రౌండర్‌గా పని కొనస్తాడనుకుంటే అస్సలు బౌలింగే చేయడం లేదు. పైగా ఈ సీజన్‌కు ముందు కెప్టెన్సీ కూడా కావాలని మారాని చేశాడు. చెత్త ప్రదర్శనలతో అయ్యర్ ప్రస్తుతం కేకేఆర్ అభిమానులకు టార్గెట్‌గా మారాడు.
కాగా, ఈ మ్యాచ్‌లో ఘోరంగా విఫలమైన కేకేఆర్ బ్యాటర్లపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. 23.75 కోట్ల భారీ మొత్తం పెట్టి కొన్న వైస్ కెప్టెన్ వెంకటేశ్ అయ్యర్‌ను కేకేఆర్ అభిమానులే టార్గెట్ చేస్తున్నారు. ఫ్రాంచైజీ నమ్మకాన్ని వమ్ము చేశాడని కామెంట్లు చేస్తున్నారు. భారీ మొత్తం పెట్టి కొనుగోలు చేయడంతో వైస్ కెప్టెన్సీ అప్పగిస్తే ఇదేనా నువ్వు చేసేదంటూ మండిపడుతున్నారు. అతని కంటే కొత్తగా వచ్చిన కుర్రాళ్లు అనికేత్ వర్మ , విప్రాజ్ నిగమ్ చాలా మేలని కామెంట్లు చేస్తున్నారు. అతనిపై పెట్టిన పెట్టుబడి దండగ …ఇంత దానికి కెప్టెన్సీ కూడా కావాలా అని ప్రశ్నిస్తున్నారు. ఆల్‌రౌండర్ అయిన అయ్యర్.. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఒక్క బంతిని కూడా వేయలేదు.
దీంతో అయ్యర్ జట్టుకు భారంగా మారాడాని, ఫ్రాంచైజీ నమ్మకాన్ని వమ్ము చేస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు. తనకు కెప్టెన్సీ కాకుండా వైస్ కెప్టెన్సీ ఇవ్వడంతోనే వెంకటేష్ ఆడడం లేదని ఇంకొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటి వరకు అయ్యర్ చేసిన పరుగులను, అతడిని దక్కిన మొత్తంతో లెక్కిస్తే.. అతడు పరుగుకు దాదాపుగా 2.7కోట్లు చొప్పున అవుతుందని లెక్కలేస్తున్నారు. పనిలో పనిగా రింకూ సింగ్, ఆండ్రీ రసెల్‌ను కూడా ఏకి పారేస్తున్నారు. వీరిపై పెట్టిన పెట్టుబడి కూడా బూడిదలో పోసిన పన్నీరే అని అంటున్నారు. ఈ సీజన్‌కు ముందు రింకూను 13 కోట్లకు, రసెల్‌ను 12 కోట్లకు కేకేఆర్ రీటైన్ చేసుకుంది. కాగా ఈ సీజన్ లో ఇప్పటికే 3 మ్యాచ్ లు ఆడిన కోల్ కత్తా ఒక విజయమే సాధించి పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో నిలిచింది.