Aishwarya Rai: ఐశ్వర్య రాయ్‌పై పాక్ మాజీ ప్లేయర్ అనుచిత వ్యాఖ్యలు.. ఫైరవుతున్న ఇండియన్స్..
మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారానికి తేరలేపాయి. అబ్దుల్ రజాక్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వైఖరిని తప్పుపడుతూ.. క్రికెట్‌తో ఏ సంబంధం లేని బాలీవుడ్ నటి, మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్‌ని మధ్యలోకి లాగాడు.
Aishwarya Rai: భారత గడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 నుంచి పాకిస్తాన్ నిష్క్రమించిన విషయం తెలిసిందే. మెగా టోర్నీ లీగ్ స్టేజ్‌లో కేవలం నాలుగు విజయాలను మాత్రమే సాధించడంతో పాక్ ఇంటిముఖం పట్టింది. భారత్, ఆస్ట్రేలియా, ఆఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయి.. సెమీఫైనల్ చేరకుండానే వెనుదిరిగిన పాకిస్తాన్‌పై ఆ దేశంలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పాక్ ఓటములను అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు.
Rohit Sharma: టీమిండియా బ్రహ్మాస్త్రం అతడే.. సెమీస్‌లోనూ విజృంభిస్తే..
ఈ క్రమంలో మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారానికి తేరలేపాయి. అబ్దుల్ రజాక్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వైఖరిని తప్పుపడుతూ.. క్రికెట్‌తో ఏ సంబంధం లేని బాలీవుడ్ నటి, మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్‌ని మధ్యలోకి లాగాడు. పాక్ మాజీ క్రికెటర్లు షాహిది ఆఫ్రిది, ఉమర్ గిల్, అబ్దుల్ రజాక్ మధ్య తాజాగా మీడియా ఇంటరాక్షన్ జరగ్గా.. పాకిస్థాన్ జట్టు ఇటీవలి ప్రదర్శనల గురించి చర్చ మొదలైంది. ఈ చర్చలో భాగంగా అబ్దుల్ రజాక్ హద్దులు దాటాడు. ఐశ్వర్య రాయ్‌ను తాను పెళ్లి చేసుకుంటే.. అందమైన, పవిత్రమైన పిల్లలు పుడుతారనుకుంటే పొరబడినట్లే? అని రజాక్ పేర్కొన్నాడు. అబ్దుల్ రజాక్ చేసిన వ్యాఖ్యలపై మాజీ కెప్టెన్ షాహిది ఆఫ్రిది చప్పట్లు కొట్టాడు. రజాక్ వ్యాఖ్యలు సరైనవే అని అంగీకరించాడు.
ఇందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. రజాక్ వ్యాఖ్యలపై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. రజాక్ క్రికెట్ గురించి మాట్లాడకుండా.. మధ్యలో ఐశ్వర్య రాయ్‌ని ఎందుకు లాగాడు అని కామెంట్లు పెడుతున్నారు. రజాక్ రోజురోజుకు మరింతగా దిగజారిపోతున్నాడని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.