Anand Mahindra: కార్ ఇమ్మంటే ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే..?
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాకు నెటిజన్ల నుంచి ఓ విజ్ఞప్తి అందింది. ఆనంద్ మహీంద్రా సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారనే విషయం తెలిసిందే. సిరాజ్ ప్రదర్శనపై ట్విటర్ వేదికగా ఆనంద్ మహీంద్రా అభినందనలు కురిపించారు.

Anand Mahindra: ఆసియా కప్ ఫైనల్‌లో శ్రీలంకపై ఆరు వికెట్లతో విరుచుకుపడిన భారత పేసర్ సిరాజ్ పేరు మారుమోగిపోతోంది. అంతేకాకుండా, తనకు వచ్చిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రివార్డును కూడా కొలంబో గ్రౌండ్ సిబ్బందికి ఇస్తున్నట్లు ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాకు నెటిజన్ల నుంచి ఓ విజ్ఞప్తి అందింది. ఆనంద్ మహీంద్రా సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారనే విషయం తెలిసిందే.
సిరాజ్ ప్రదర్శనపై ట్విటర్ వేదికగా ఆనంద్ మహీంద్రా అభినందనలు కురిపించారు. మహమ్మద్ సిరాజ్ నువ్వొక మార్వెల్ అవెంజర్‌వి’’ అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. దానిని రీట్వీట్ చేస్తూ ఓ అభిమాని.. ‘‘సర్, సిరాజ్‌కు ఓ ఎస్‌యూవీ ఇవ్వండి’’ అని రిక్వెస్ట్ పెట్టాడు. గతంలోనే ఒక కార్ బహుమతిగా ఇచ్చినట్టు మహీంద్రా బదులిచ్చారు. 2021లోనే సిరాజ్‌కు ఓ ‘థార్’ను ఆనంద్ మహీంద్రా బహూకరించారు. ఆసీస్‌తో టెస్టు మ్యాచ్ గెలిచిన తర్వాత సిరాజ్‌కు ఆ కారును బహుమతిగా ఇచ్చారు ఆనంద్ మహీంద్రా.
కొలంబో క్రికెట్ గ్రౌండ్ సిబ్బంది కోసం తన రివార్డును సిరాజ్ ప్రకటించడంపైనా ఆనంద్ మహీంద్రా స్పందించారు. ‘‘సిరాజ్ నిర్ణయంపై ఒకే ఒక్క మాట చెబుదామనుకుంటున్నా. అదేంటంటే ‘క్లాస్’. ఇదేమీ మీ సంపద లేదా మీ నేపథ్యం నుంచి వచ్చేది కాదు. మీలో ఉంటేనే అది బయటకు కనిపిస్తుంది’’ అని ట్వీట్ చేశారు.