Shreyass Iyer : శ్రేయస్స్ అయ్యర్ కి ఒక రికార్డు దక్కింది..
స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్ (World Cup) లో శ్రేయస్స్ అయ్యర్ (Shreyass Iyer) ఫామ్ గురించి అభిమానులు, మాజీ క్రికెటర్లు చాలా ఆందోళన చెందారు. వరుసగా మూడు వికెట్లు నేలకూలితే అయ్యర్ అసలు నిలబడగలడా అన్న ఆందోళనలు పెరిగాయి.

Fans and former cricketers are very worried about Shreyas Iyers form in the ongoing World Cup at home
స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్ (World Cup) లో శ్రేయస్స్ అయ్యర్ (Shreyass Iyer) ఫామ్ గురించి అభిమానులు, మాజీ క్రికెటర్లు చాలా ఆందోళన చెందారు. వరుసగా మూడు వికెట్లు నేలకూలితే అయ్యర్ అసలు నిలబడగలడా అన్న ఆందోళనలు పెరిగాయి. ఈ ఆందోళనలను మరింత పెంచుతూ ప్రపంచకప్‌లో తొలి నాలుగు మ్యాచుల్లో అయ్యర్ పెద్దగా రాణించలేదు. ఈ పరిస్థితుల్లో అయ్యర్‌ను ఇంకా నాలుగో స్థానంలో కొనసాగించడంపై ఆందోళనలు కూడా వచ్చాయి. కానీ శ్రేయస్ లయ అందుకున్నాక అతడిని ఆపటం ఎవ్వరి తరమూ కావడం లేదు. శతకాలు సాధించకపోయినా అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో శ్రేయస్స్ జట్టుకు విలువైన పరుగులు జోడిస్తున్నాడు.
2023 World Cup : సర్ జడేజా ..‘మొదటి నుంచి కూడా నేను కెప్టెన్‌గానే ఆలోచిస్తా.
సౌతాఫ్రికా (South Africa) తో జరిగిన మ్యాచ్‌లో కీలక సమయంలో విలువైన ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ అయ్యర్ 77 పరుగులతో సత్తా చాటాడు. ఈ ప్రపంచకప్‌లో శ్రేయస్ అయ్యర్‌కు ఇది మూడో హాఫ్ సెంచరీ. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అయ్యర్.. ఈ మూడు అర్ధ శతకాలు చేశాడు. 48 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో ఒకే ఎడిషన్‌లో భారత్ తరఫున నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి మూడు సార్లు 50కిపైగా పరుగులు చేయడం తొలిసారి. ఇంతకుముందూ నాలుగో స్థానంలో ఇది జరగనే లేదు. ఈ ఘనత సాధించిన తొలి భారత బ్యాటర్ (Indian Batter) గా శ్రేయస్ రికార్డు సృష్టించాడు. భారత్ తరఫున ఒకే ప్రపంచకప్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసి అత్యధిక సార్లు 50కుపైగా పరుగులు సాధించిన బ్యాటర్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు. ఈ ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 62 బంతుల్లో 53 పరుగులు చేసిన అయ్యర్, బంగ్లాదేశ్ (Bangladesh) తో జరిగిన మ్యాచ్‌లో 56 బంతుల్లోనే 82 పరుగులు చేశాడు. ఇక సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 87 బంతుల్లో 77 పరుగులు చేశాడు.