Shubman Gill: శుభమన్ గిల్ పై బ్యాండ్ మోగిస్తున్న ఫ్యాన్స్
మంచి ఫామ్‌లో ఉన్న ఆటగాడిపై అభిమానులకు భారీ అంచనాలే ఉంటాయి. ప్రతీ మ్యాచ్‌లోనూ అద్భుతంగా రాణించాలని కోరుకోరు గానీ, కనీసం ఆశాజనకమైన ఇన్నింగ్స్ ఆడినా చాలు, సంతృప్తి పొందుతారు. అలా కాకుండా వరుసగా విఫలమైతే మాత్రం.. ఇక వారిపై నెట్టింట్లో బ్యాండ్ బాజా మొదలుపెడతారు.

Shubham Gill, West Indies Test Match, Shortest Runs, Get Out, Fans Angry, Team India, Batsmen
ఇప్పుడు శుబ్మన్ గిల్‌పై కూడా అలాంటి విమర్శలే వెల్లువెత్తుతున్నాయి. వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో అతడు రెండు మ్యాచ్‌ల్లోనూ ఫెయిల్ అవ్వడంతో.. ఫ్యాన్స్ శుబ్మన్‌పై మండిపడుతున్నారు. డొమినికా వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో శుబ్మన్ గిల్ 11 బంతుల్లో కేవలం 6 పరుగులే చేసి ఔట్ అయ్యాడు. విండీస్ స్పిన్నర్ వారికన్ బౌలింగ్‌లో అలిక్ అథనాజ్‌కు క్యాచ్ ఇచ్చి.. అతడు పెవిలియన్ బాట పట్టాడు.
ఇప్పుడు ట్రినిడాడ్‌లో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో కూడా అతడు నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 12 బంతులు ఎదుర్కొని, కేవలం 10 పరుగులు మాత్రమే చేశాడు. కరేబియన్ పేసర్ కీమర్ రోచ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ జాషువాకు క్యాచ్ ఇచ్చి, మైదానం వీడాడు. ఈ నేపథ్యంలో.. శుబ్మన్ ఆటతీరుపై టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా అతనిపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. వీటికి సమాధానం ఇవ్వాలంటే, గిల్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాల్సిందే.