జాంటీని చూసినట్టుంది సిరాజ్ క్యాచ్ పై ఫ్యాన్స్

గత కొన్నేళ్ళుగా భారత క్రికెటర్ల ఫీల్డింగ్ అత్యుత్తమ స్థాయిలో ఉందని చెప్పొచ్చు. టీ ట్వంటీ వరల్డ్ కప్ లో పలు అద్భుతమైన క్యాచ్ లు అందుకున్న మన క్రికెటర్లు అన్ని ఫార్మాట్లలోనూ బెస్ట్ ఫీల్డింగ్ తో అదరగొట్టేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 1, 2024 | 03:14 PMLast Updated on: Oct 01, 2024 | 3:14 PM

Fans Compare Siraj Catch With Jonty Roads

గత కొన్నేళ్ళుగా భారత క్రికెటర్ల ఫీల్డింగ్ అత్యుత్తమ స్థాయిలో ఉందని చెప్పొచ్చు. టీ ట్వంటీ వరల్డ్ కప్ లో పలు అద్భుతమైన క్యాచ్ లు అందుకున్న మన క్రికెటర్లు అన్ని ఫార్మాట్లలోనూ బెస్ట్ ఫీల్డింగ్ తో అదరగొట్టేస్తున్నారు. తాజాగా కాన్పూర్ టెస్టులో రోహిత్ తో పాటు సిరాజ్ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. అశ్విన్ బౌలింగ్ లో షకీబుల్ భారీ షాట్ కొట్టగా… సిరాజ్ వెనక వైపుగా పరిగెత్తుతూ పూర్తిగా గాల్లోకి ఎగిరి సింగిల్ హ్యాండ్ క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్ తో ఒక్కసారిగా గ్రౌండ్ మొత్తం హోరెత్తిపోయింది. ఈ క్యాచ్ తో సిరాజ్ పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. జాంటీ రోడ్స్ ను గుర్తు చేసావంటూ కితాబిస్తున్నారు.