Rohit Sharma : ముంబై నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్.. రోహిత్ శర్మ నెక్ట్స్ ఎటు ?
ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలబెట్టిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు భారీ షాకిచ్చింది ముంబై ఇండియన్స్. కెప్టెన్‌గా హార్థిక్ పాండ్యాను నియమించింది. ముంబై ఇండియన్స్ నిర్ణయాన్ని ఫ్యాన్ జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు.. రోహిత్ శర్మ ఏం చేస్తాడా అనే ఉత్కంఠ పెరుగుతోంది. ఐపీఎల్ సీజన్ సమయం దగ్గరపడుతోంది. ఇలాంటి టైంలో ఫ్యాన్స్‌కు ముంబై ఇండియన్స్ వరుస షాక్‌లిస్తోంది.
ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలబెట్టిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు భారీ షాకిచ్చింది ముంబై ఇండియన్స్. కెప్టెన్‌గా హార్థిక్ పాండ్యాను నియమించింది. ముంబై ఇండియన్స్ నిర్ణయాన్ని ఫ్యాన్ జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు.. రోహిత్ శర్మ ఏం చేస్తాడా అనే ఉత్కంఠ పెరుగుతోంది. ఐపీఎల్ సీజన్ సమయం దగ్గరపడుతోంది. ఇలాంటి టైంలో ఫ్యాన్స్‌కు ముంబై ఇండియన్స్ వరుస షాక్‌లిస్తోంది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను క్యాష్ ట్రేడింగ్ ద్వారా టీంలోకి తెచ్చుకున్న ముంబై ఇండియన్స్.. తాజాగా కెప్టెన్‌గా రోహిత్ శర్మను తప్పించింది. ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలబెట్టిన రోహిత్ శర్మ కెప్టెన్సీపై వేటు వేసి హార్దిక్ పాండ్యాను కొత్త సారథిగా ప్రకటించింది.
దీనికి సంబంధించి ముంబై ఇండియన్స్ రిలీజ్ చేసిన ప్రకటన.. ఫ్యాన్స్‌ను అసహనానికి గురి చేసింది. 2013 సీజన్‌లో వరుస ఓటముల తర్వాత రికీ పాంటింగ్ వైదొలగడంతో.. రోహిత్ శర్మ ఆ సీజన్ మధ్యలో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. సచిన్, జయసూర్య, షాన్ పొలాక్, రికీ పాంటింగ్ వంటి దిగ్గజాలు ఉన్నా సాధించలేని ఐపీఎల్ ట్రోఫీని ముంబై ఇండియన్స్‌కు హిట్‌మ్యాన్ అందించాడు. సారథిగా బాధ్యతలు చేపట్టిన తొలి సీజన్‌లోనే ముంబై.. ఫస్ట్ ఐపీఎల్ ట్రోఫీని దక్కించుకుంది. ఆ తర్వాత 2015, 2017, 2019, 2020 సీజన్లలో ముంబై ఐపీఎల్ ట్రోఫీలను గెలుచుకుంది. ఇక 2015 ఐపీఎల్ సీజన్‌లో టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. అదే ఏడాది భారత జట్టులోకి అరంగేట్రం చేసిన పాండ్యా.. ముంబై విజయాలలో కీలక పాత్ర పోషించాడు. కీరన్ పొలార్డ్ తో కలిసి పాండ్యా ముంబైకి అద్భుత విజయాలను అందించాడు. అయితే 2021లో పాండ్యాను ముంబై వేలంలో వదిలేసింది. దీంతో.. 2022లో గుజరాత్ టైటాన్స్ హార్ధిక్‌ను కెప్టెన్‌గా నియమించుకుంది.
తొలి సీజన్‌లోనే గుజరాత్‌కు టైటిల్‌ను అందించాడు పాండ్యా. రెండో సీజన్‌లో ఫైనల్ చేర్చాడు. కానీ.. ఇటీవలే జరిగిన ఐపీఎల్ రిటెన్షన్ ప్రాసెస్‌లో పాండ్యాను ముంబై.. గుజరాత్ నుంచి వెనక్కి తీసుకుంది. పాండ్యా రీఎంట్రీతోనే అతడిని ముంబై భావి సారథిగా అనుకున్నా.. 2025 సీజన్‌లో ఆ ప్రక్రియ మొదలుకావొచ్చని అందరూ భావించారు. కానీ, ముంబై మాత్రం వచ్చే సీజన్‌లోనే రోహిత్‌ను సారథిగా తప్పించి పాండ్యాకు ఆ బాధ్యతలు అప్పజెప్పడం అందరినీ షాక్‌కు గురిచేసింది. అయితే.. లెగసీ బిల్డింగ్‌లో భాగంగానే కెప్టెన్‌ను మార్చినట్లు ముంబై ఇండియన్స్ గ్లోబల్ హెడ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ మహేల జయవర్ధనే క్లారిటీ ఇచ్చాడు. టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచనకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.
సచిన్ నుంచి హర్భజన్ వరకు, రికీ పాంటింగ్ నుంచి రోహిత్ వరకు అసాధారణమైన నాయకత్వంలో ముంబై పనిచేసిందని, వాళ్లంతా భవిష్యత్తు కోసం జట్టును బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారన్నాడు. దీనికి కొనసాగింపుగానే ఇప్పుడు హార్ధిక్ కు అవకాశం ఇస్తున్నట్లు తెలిపాడు మహేళ.. కెప్టెన్సీ నుంచి ముంబై తప్పించడంతో.. రోహిత్ శర్మ ఏం చేయబోతున్నాడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అటు ఢిల్లీ, ఇటు సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండు టీమ్‌లు హిట్‌మ్యాన్ కోసం ట్రయల్స్ స్టార్ట్ చేసాయి. మరోవైపు.. రోహిత్‌ను కెప్టెన్‌గా తొలగించడంతో ఫ్యాన్స్ అగ్గిమీద గుగ్గిలమతున్నారు. ముంబై ఇండియన్స్ జెర్సీ, క్యాప్‌ను తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు.