నీ ఆటకు రూ.27 లక్షలే ఎక్కువ పంత్ పై ఫ్యాన్స్ సెటైర్లు

లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఫ్లాప్ షో కంటిన్యూ అవుతోంది. తన మాజీ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ పై మళ్లీ ఫెయిలయ్యాడు. ఈ సీజ న్ లో ఆ టీమ్ తో ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ డకౌటయ్యాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 23, 2025 | 02:50 PMLast Updated on: Apr 23, 2025 | 2:50 PM

Fans Satirize Pant For Playing For Rs 27 Lakhs

లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఫ్లాప్ షో కంటిన్యూ అవుతోంది. తన మాజీ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ పై మళ్లీ ఫెయిలయ్యాడు. ఈ సీజ న్ లో ఆ టీమ్ తో ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ డకౌటయ్యాడు. అనూహ్యంగా ఏడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన పంత్ లాస్ట్ రెండు బంతులాడి సున్నాకే ఔటయ్యాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో తొమ్మిది ఇన్నింగ్స్‌లో కేవలం 106 పరుగులు మాత్రమే చేసిన పంత్.. ఢిల్లీపై 7వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. తొమ్మిది సంవత్సరాల తర్వాత తొలిసారిగా పంత్ టీ20 కెరీర్‌లో 7వ స్థానం లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. చివరిసారిగా ఐపీఎల్ 2016లో రెండు సార్లు ఇలా చేశాడు.
వరుస వైఫల్యాల నేపథ్యంలో పంత్‌ భారీ ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నాడు. లక్నో ఓనర్‌ సంజీవ్‌ గొయెంకా రాహుల్‌ లాంటి ఆణిముత్యాన్ని వదులుకుని పంత్‌ లాంటి చెత్తను 27 కోట్లకు కొనుక్కున్నాడని కామెంట్లు చేస్తున్నారు.

రాహుల్‌ను కాదనుకుని ఎంతో నమ్మకంతో కెప్టెన్సీ కూడా కట్టబెడితే ఇదేనా వెలగబెట్టేదని మండిపడుతున్నారు. పంత్‌కు 27 లక్షలు కూడా దండగే అని అంటున్నారు. ఈ దెబ్బతో పంత్‌ పని అయిపోయిందని చర్చించుకుంటున్నారు. ఈ సీజన్ లో పంత్ చెన్నైపై అర్ధ సెంచరీ మినహా అతడు ఆడింది లేదు. ఇక బ్యాటింగ్ ఆర్డర్‌లో ఏ స్థానంలో వచ్చినా ఆడలేకపోతున్నాడు. అయితే లక్నోతో జరిగిన మ్యాచ్ లో పంత్.. ధోనిని అనుకరించే ప్రయత్నం చేశాడు. కష్టాల్లో ఉన్నప్పుడు అస్సలు బ్యాటింగ్ రాడంటూ.. ఎక్కడో 9వ స్థానంలో బ్యాటింగ్ కు వస్తాడంటూ ధోనీపై విమర్శలు వచ్చాయి. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లోనూ రిషభ్ పంత్ అచ్చం ధోనిలానే చేశాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు రావాల్సిన పంత్.. ఏకంగా 7వ స్థానంలో వచ్చాడు.

అయితే రెండు బంతులను ఆడి ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. అంతేకాకుండా ఇన్నింగ్స్ ఆఖరి బంతికి బౌల్డ్ అయ్యాడు. చివరకు మరో ధోనిలా అవ్వాలనే ప్రయత్నంలో జోకర్ అయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో బ్యాటింగ్ చేయడానికి భయపడి పంత్ దాక్కున్నాడని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.కాగా, నిన్నటి మ్యాచ్‌లో పంత్‌ ఆటగాడిగానే కాకుండా కెప్టెన్‌గా కూడా ఘోరంగా విఫలమయ్యాడు. బ్యాటింగ్‌లో విఫలం కావడంతో పంత్‌ ఫీల్డింగ్‌ సమయంలో చాలా చిరాకుగా ఉన్నాడు. సహచరులపై అరుస్తూ కనిపించాడు. బౌలర్లను సరిగ్గా రొటేట్‌ చేయలేకపోయాడు. ఐపీఎల్ మెగా వేలంలో పంత్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా 27 కోట్లు ఖర్చు పెట్టింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా పంత్ నిలిచాడు. వరుస వైఫల్యాలతో లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకాకు ఆ డబ్బులు తిరిగి ఇచ్చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.