Akash Deep: నాలుగో టెస్టులో ఆకాశ్‌దీప్ అరంగేట్రం
వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగా అతనికి విశ్రాంతిచ్చారు. ఈ నేపథ్యంలో బూమ్రా స్థానంలో ఎవరికి చోటు దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ ప్లేస్ కోసం ముకేశ్ కుమార్, ఆకాశ్‌దీప్ పోటీ పడుతున్నారు.

Akash Deep: ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టుకు టీమిండియా రెడీ అవుతోంది. ఇప్పటికే రాంఛీ చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీస్‌ను మొదలుపెట్టాయి. అయితే ఈ మ్యాచ్‌కు భారత స్టార్ పేసర్ బూమ్రా దూరమయ్యాడు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగా అతనికి విశ్రాంతిచ్చారు. ఈ నేపథ్యంలో బూమ్రా స్థానంలో ఎవరికి చోటు దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ ప్లేస్ కోసం ముకేశ్ కుమార్, ఆకాశ్‌దీప్ పోటీ పడుతున్నారు.
JANASENA VS YSRCP: సివిల్స్ చదివిన యువతికి వాలంటీర్ జాబ్.. జనసేన రియాక్షన్ చూస్తే..
దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటి తొలిసారి టీమిండియా పిలుపును అందుకున్న బెంగాల్ పేసర్, ఆకాశ్ దీప్ అరంగేట్రం చేయనున్నట్టు తెలుస్తోంది. అతనికి ముకేష్ కుమార్ నుంచి పోటీ ఎదురు కానున్నా.. టీమిండియా మేనేజ్‌మెంట్ ఆకాశ్‌దీప్ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇంగ్లండ్ లయన్స్ జట్టుతో భారత్ ఏ తరఫున బరిలోకి దిగిన ఆకాశ్ దీప్ 11 వికెట్లు తీసాడు. మరోవైపు ముకేష్ కుమార్ సైతం బిహార్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌లో 10 వికెట్లు పడగొట్టాడు. అయితే వైజాగ్ టెస్ట్‌లో మాత్రం ముకేష్ కుమార్ తేలిపోయాడు. దీంతో అతనికి చోటు కష్టమేనని తెలుస్తోంది. అదే సమయంలో రివర్స్ స్వింగ్ రాబట్టడంలో ఆకాశ్ దీప్ దిట్ట.
ఇప్పటి వరకు అతను 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 23.58 యావరేజ్‌తో 104 వికెట్లు తీసాడు. ఒకవేళ ఆకాశ్ దీప్.. నాలుగో టెస్ట్‌లో బరిలోకి దిగితే ఈ సిరీస్‌లో మూడో అరంగేట్ర భారత ప్లేయర్‌గా నిలుస్తాడు. ఇదిలా ఉంటే ఈ సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. రాంచీ టెస్ట్‌లో విజయం సాధించి 3-1తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది.