Virat Kohli : నా కంటే కోహ్లేనే గ్రేట్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన కంటే కోహ్లీనే గ్రేట్ అన్నాడు.

Former captain Sourav Ganguly made interesting comments about Team India's star batsman Virat Kohli.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన కంటే కోహ్లీనే గ్రేట్ అన్నాడు. నిజానికి కొన్ని సందర్భాల్లో కోహ్లీ-గంగూలీ ఆటతీరు మీద కూడా పోలికలు వచ్చాయి. విరాట్ గ్రేట్ అని కొందరు.. కాదు, కాదు దాదా గొప్ప అంటూ మరికొందరు చర్చకు తెరలేపారు. అయితే ఆ కాంట్రవర్సీపై గంగూలీ క్లారిటీ ఇవ్వడంతో దానికి ఫుల్ స్టాప్ పడింది. ఇద్దరిలో ఎవరు గ్రేట్ అనే దానిపై తొలిసారి దాదా రియాక్ట్ అయ్యాడు. తన కంటే కోహ్లీనే గొప్ప అన్నాడు. అగ్రెషన్ పరంగా కాదనీ, గేమ్, స్కిల్స్ పరంగా చూసుకుంటే తన కంటే విరాట్ గ్రేట్ అని మెచ్చుకున్నాడు. కింగ్ అద్భుతమైన ఆటగాడని, ఎన్నో రికార్డులను అతడు బ్రేక్ చేశాడని, మరిన్ని బద్దలు కొడతాడని చెప్పుకొచ్చాడు. ఇద్దరు ఆటగాళ్లను పోల్చి చూడడానికి వారి దూకుడు అనేది ప్రాతిపదిక కాదన్నాడు. కోహ్లీని మెచ్చుకుంటూ గంగూలీ చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియాలో నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.