Hardik Pandya: కెప్టెన్సీ రేసులో పాండ్యాకు పోటీ.. శుభ్‌మన్ గిల్‌తోపాటు రేసులోకి మరో స్టార్ ప్లేయర్

ఈ క్రమంలో రోహిత్‌ వారసుడిని తయారు చేయాల్సిన సమయం ఆసన్నమైందని పలువరు మాజీ క్రికెటర్‌లు అభిప్రాయపడ్డారు. కాగా భారత్‌ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌ తర్వాత రోహిత్‌ కెప్టెన్సీపై బీసీసీఐ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్సీ కోసం ఇద్దరు ఆటగాళ్ల పేర్లను భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్ గవాస్కర్ సూచించాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 24, 2023 | 05:18 PMLast Updated on: Jun 24, 2023 | 5:18 PM

Former Cricketer Sunil Gavaskar Picks Shubman Gill Axar Patel As Future India Captaincy Candidates

Hardik Pandya: మూడు ఫార్మాట్‌లలో భారత జట్టు కెప్టెన్‌గా స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ కొనసాగుతున్న తెలిసిందే. గతేడాది విరాట్‌ కోహ్లి నుంచి టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్‌ శర్మ స్వీకరించాడు. కెప్టెన్సీ పరంగా రోహిత్‌ శర్మ ద్వైపాక్షిక సిరీస్‌లలో సఫలమైనప్పటికీ.. ఐసీసీ ఈవెంట్‌లలో మాత్రం జట్టును నడిపించడంలో విఫలమయ్యాడు. ముఖ్యంగా ఆసియాకప్‌, టీ20 ప్రపంచకప్‌-2022, డబ్ల్యూటీసీ ఫైనల్లో ఘోర ఓటములను టీమిండియా చవిచూసింది.

ఈ క్రమంలో రోహిత్‌ వారసుడిని తయారు చేయాల్సిన సమయం ఆసన్నమైందని పలువరు మాజీ క్రికెటర్‌లు అభిప్రాయపడ్డారు. కాగా భారత్‌ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌ తర్వాత రోహిత్‌ కెప్టెన్సీపై బీసీసీఐ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్సీ కోసం ఇద్దరు ఆటగాళ్ల పేర్లను భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్ గవాస్కర్ సూచించాడు. వారిద్దరూ ఎవరో కాదు.. ఒకరు టీమిండియా యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌.. మరొకరు ఆల్‌రౌండ్‌ అక్షర్‌ పటేల్‌. వారిని ఇప్పటి నుంచి జట్టు పగ్గాలు చేపట్టే విధంగా భారత సెలెక్టర్లు తాయారు చేయాలని గవాస్కర్ అన్నాడు. “శుబ్‌మన్‌ గిల్‌, అక్షర్‌ పటేల్‌కు భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్‌లు అయ్యే ఛాన్స్‌ ఉంది.

గిల్‌ ఇప్పటికే తానుంటో నిరూపించుకోగా.. అక్షర్‌ రోజు రోజుకు మరింత మెరుగవుతున్నాడు. వీరిద్దరిని వేర్వేరు ఫార్మాట్‌లలో భారత జట్టు వైస్‌ కెప్టెన్‌లుగా నియమించాలి. ఇప్పటి నుంచే జట్టు పగ్గాలు చేపట్టే విధంగా తాయారుచేసుకోవాలి. నా వరకు అయితే వీరిద్దరిని ఫ్యూచర్‌ కెప్టెన్‌లుగా సిద్దం చేసుకుంటే చాలు. ఇక టెస్టుల్లో అజింక్య రహానెను వైస్ కెప్టెన్‌గా చేయడం ఏ మాత్రం తప్పులేదు. కానీ ఒక యువ ఆటగాడిని నాయుకుడిగా తీర్చిదిద్దే అవకాశాన్ని సెలక్టర్లు కోల్పో‍యారు. టెస్టుల్లో భవిష్యత్తు కెప్టెన్‌గా ఎవరో ఒకరిని అనుకుని వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేసి ఉంటే బాగుండేది” అని ఓ ఇంటర్వ్యూలో సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు.