నడవలేని స్థితిలో మాజీ క్రికెటర్

భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తాజాగా నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. కాళ్ళు సహకరించక ఒకచోట ఆగిపోయిన కాంబ్లీని స్థానికులు చేయి అందించి నడిపించారు. ముగ్గురు వ్యక్తులు పట్టుకుని అతన్ని తీసుకెళ్ళడం వీడియోలో కనిపిస్తోంది. కెరీర్ ఆరంభంలో సచిన్ సమానమైన ఆటగాడిగా వినోద్ కాంబ్లీకి గుర్తింపు ఉంది. స్కూల్ క్రికెట్ లో సచిన్ తో కలిసి వరల్డ్ రికార్డు నమోదు చేసిన కాంబ్లీ భారత్ తరపున 17 టెస్టులు, 104 వన్డేలు ఆడాడు. వ్యక్తిగతంగా పలు వివాదాలు, ఇతర కారణాలతో కాంబ్లీ ఫేడవుట్ అయిపోయాడు.