Sehwag: ఆదిపురుష్ మూవీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు
అటు ప్రభాస్ ఫ్యాన్స్‌కు, ఇటు సినిమా లవర్స్‌కు ఆదిపురుష్ మిగిల్చిన డిజప్పాయింట్‌మెంట్ అంతా ఇంతా కాదు. సినిమా చూసిన వాళ్లలో చాలామంది విమర్శలు చేస్తూనే ఉన్నారు.

Former cricketer Virender Sehwag commented on Adipurush saying that now it is understood why Kattappa killed Baahubali
నాలుగో రోజు నుంచి ఖాళీ సీట్లు కనిపించాయ్ థియేటర్లలో. రామాయణం అని చెప్పి ముందు నుంచి ప్రమోట్ చేసిన మేకర్స్.. రిలీజ్ అయిన తర్వాత మాట మార్చారు. రామాయణంలో పాత్రల స్వరూపాలు పూర్తిగా మార్చేయడంతో జనాల్లో వ్యతిరేకత వచ్చింది. దీంతో రామాయణం నుంచి ఇన్‌స్పైర్ అయ్యాం తప్ప.. రామాయణం కాదు అంటూ కొత్త వాదన మొదలుపెట్టారు. అభిమానులకు ఇది మరింత కోపం తెప్పించింది. మూవీ మీద విమర్శలు వస్తున్నా.. డైరెక్టర్, రైటర్ దానిని సమర్ధించుకుంటూ కొన్ని కామెంట్స్ చేయడంతో మరింత వివాదాల్లో నిలిచింది.
వీరిద్దరిపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయ్. ఇప్పటికే నేపాల్‌లో సినిమాని బ్యాన్ చేయడం, మనదగ్గర కూడా బ్యాన్ చేయమని అడగడం కూడా జరిగింది. ప్రభాస్ అభిమానులతో పాటు నెటిజన్లు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మూవీ మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఐతే ఇప్పుడు వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఆదిపురుష్ మీద ఘాటు వ్యాఖ్యలు చేశాడు. సెటైర్లతో సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టాడు. ఆదిపురుష్ సినిమా చూసిన తర్వాత.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో అర్థం అయిందంటూ సెహ్వాగ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. మారింది.
సెహ్వాగ్ సపోర్టుగా ఆదిపురుష్‌పై మరిన్ని విమర్శలు చేస్తూ కామెంట్స్ చేస్తుండగా.. కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం సెహ్వాగ్‌ని విమర్శిస్తున్నారు. ఏమైనా ఆదిపురుష్ కాంట్రవర్సీ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఈ సినిమా మీద.. అయోధ్య సాధువులు కూడా భగ్గుమంటున్నారు. బ్యాన్ చేయాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమాలో డైలాగులు మారుస్తూ కొత్త ప్రింట్‌లు రిలీజ్ చేశారు. ఐనా సరే వివాదానికి ఫుల్‌స్టాప్ పడడం లేదు.