ఓరి పిచ్చి నా డాష్ గాళ్ళారా… పాక్ లో ఆడినా ఇండియానే గెలిచేది…!
ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమిండియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఛాంపియన్స్ కు తగ్గట్టే ఆడి టైటిల్ కైవసం చేసుకుందని పలువురు మాజీ ఆటగాళ్ళు ప్రశంసిస్తున్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమిండియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఛాంపియన్స్ కు తగ్గట్టే ఆడి టైటిల్ కైవసం చేసుకుందని పలువురు మాజీ ఆటగాళ్ళు ప్రశంసిస్తున్నారు. అయితే ఒకే వేదికపై ఆడడం వల్లనే భారత్ టైటిల్ విన్ అయిందంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. భారత్ విజయాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్థాన్ లో జరగడంతో ఆ దేశానికి వెళ్లేది లేదని టీమిండియా.. దుబాయ్ లో ఆడింది. అన్ని మ్యాచ్ లో అక్కడే ఆడటం టీమ్ కు కలిసొచ్చిందని చాలా మంది ఆరోపించారు. అయితే పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ ఈ కామెంట్స్ ను కొట్టిపారేశాడు. ప్రపంచంలో ఎక్కడ ఆడినా ఇండియానే గెలిచేదని డ్రెస్సింగ్ రూమ్ షోలో అతడు అన్నాడు.ఆ సత్తా ఆ టీమ్ కు ఉందని అతడు వ్యాఖ్యానించాడు.
దుబాయ్ లోనే అన్ని మ్యాచ్ లు ఆడటంపై ఎంతో చర్చ జరిగిందనీ,. అక్కడే ఆడాలని ముందుగానే నిర్ణయించారన్నాడు. భారత్ 2024 టీ20 వరల్డ్ కప్ ఒక్క మ్యాచ్ ఓడకుండా సొంతం చేసుకుందని గుర్తు చేశాడు ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అదే జరిగిందన్నాడు. వాళ్ల క్రికెట్ ఎంత లోతుగా ఉందో దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చునీ అక్రమ్ అభిప్రాయ పడ్డాడు. వాళ్ల నాయకత్వం ఎలాంటిదో కూడా ఇది చెబుతోందని అక్రమ్ అన్నాడు.
భారత్ లో క్రికెట్ టీమ్ ని నడిపే విషయంలో బీసీసీఐ ఎప్పటికీ అత్యుత్తమ స్థాయిలోనే ఉంటుందనీ అక్రమ్ ప్రశంసించాడు. న్యూజిలాండ్ చేతుల్లో స్వదేశంలో టెస్ట్ సిరీస్ లో వైట్ వాష్ అయ్యారనీ. శ్రీలంకలో వన్డే సిరీస్ తో పాటు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ ఓడారన్నాడు.. ఈ సమయంలో రోహిత్, గంభీర్ పై ఎన్ని విమర్శలు వచ్చినా.. బీసీసీఐ వాళ్లపైనే నమ్మకం ఉంచడం ఇప్పుడు కలిసొచ్చిందని అక్రమ్ చెప్పుకొచ్చాడు.మా కెప్టెన్, మా కోచ్ అని మద్దతుగా నిలిచారనీ , ఇప్పుడు వాళ్లు ఛాంపియన్స్ కే ఛాంపియన్ అయ్యారని అక్రమ్ చెప్పాడు.ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ ను 4 వికెట్లతో చిత్తు చేసిన టీమిండియా విజేతగా నిలిచింది. ఈ ట్రోఫీ గెలవడం టీమిండియాకు ఇది మూడోసారి. ఇప్పటి వరకూ మరే ఇతర జట్టుకూ ఈ ఘనత సాధ్యం కాలేదు.