Saurabh Ganguly: అంతా జంక్.. ఒక్కడూ సరిగ్గా లేడు
ఆసియా కప్ టోర్నీ కి ఎంపికైన జట్టు గురించి కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ.
ఆసియాకప్ 2023 టోర్నీలో పాల్గొనే జట్లలో ఏ టీమ్ కూడా ఫేవరేట్ కాదని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. భారత్, పాకిస్థాన్ పోరులో ఎవరూ అత్యుత్తమంగా బ్యాటింగ్ చేస్తే వారికే విజయం దక్కుతుందని స్పష్టం చేశాడు. ఆగస్టు 30న ఆసియాకప్ ప్రారంభం కానుండగా.. సెప్టెంబర్ 2 భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. యావత్ క్రికెట్ ప్రపంచం ఈ హైఓల్టేజ్ సమరం కోసం ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో ఈ మ్యాచ్‌పై స్పందించిన గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘ఆసియా కప్ 2023లో ఫేవరేట్ ఎవరని చెప్పడం కష్టంగానే ఉంది. టోర్నీలో పాల్గొనే ప్రతీ జట్టుకు గెలిచే అవకాశం ఉంది. భారత్, పాకిస్థాన్ జట్లు అద్భుతంగా ఉన్నాయి. జస్‌ప్రీత్ బుమ్రా అందుబాటులోకి రావడం టీమిండియాకు అదనపు బలం. అయితే, ఆసియా కప్ వన్డే ఫార్మాట్ కావడంతో ఎలా బౌలింగ్ చేస్తాడనేది వేచి చూడాలి. సెలెక్షన్ కమిటీ ఉత్తమ జట్టునే ఎంపిక చేసిందని భావిస్తున్నా. ఉపఖండ పిచ్‌లపై ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం మంచిదే. అందుకోసం బ్యాటింగ్ కూడా చేయగలిగే అక్షర్ పటేల్ ఎంపిక సరైందే. ఆసియా కప్ అయినా, ప్రపంచకప్ అయినా బ్యాటింగ్ ఆర్డర్ రాణిస్తే విజయం సాధించడం సులువు. అని గంగూలీ చెప్పుకొచ్చాడు.