Sachin Tendulkar: సచిన్ టెండూల్కర్ ఇబ్బంది పడిన బౌలర్ బ్రెట్ లీ కాదు, అక్తర్ కాదు, షేన్ బాండ్ కాదు, వకార్ కాదు
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌కు ప్రపంచమంతా అభిమానులు ఉన్నారు. వంద సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్. తన కెరీర్‌లో లెక్కకుమించి రికార్డులను నమోదు చేసిన భారత మాస్టర్ బ్లాస్టర్‌ను కూడా ఇబ్బంది పెట్టిన బౌలర్లు ఉన్నారట. స్వయంగా సచినే చెప్పాడు మరి.

Former Team India great Sachin Tendulkar says the difficult bowler who troubled him was Abdul Razak
వాళ్ళు.. మెక్ గ్రాత్, షేన్ వార్న్, వకార్ యూనిస్, వసీమ్ అక్రమ్ అని పొరపాటుపడకండి. గతంలో ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన ‘క్లిష్టమైన బౌలర్’ పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్ అని సచిన్ చెప్పాడు. అతడి బౌలింగ్‌పై ప్రశంసలు కురిపించాడు. ఈ క్రమంలో సచిన్ వ్యాఖ్యలపై తాజాగా అబ్దుల్ రజాక్ ఆనందం వ్యక్తం చేశాడు. సచిన్ వంటి గ్రేట్ బ్యాటర్ నుంచి ఇలాంటి ప్రశంసలను ఊహించలేదని పేర్కొన్నాడు.
‘‘సచిన్ తెందూల్కర్ ఎప్పటికీ ప్రపంచస్థాయి అత్యుత్తమ బ్యాటర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతడికున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మనకు తెలిసిందే. అలాంటి సచిన్ కష్టమైన బౌలర్‌గా నా పేరు చెప్పాల్సిన అవసరం లేదు. అలా కాకుండా గ్లెన్ మెక్‌గ్రాత్, వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్, ఆంబ్రోస్, వాల్ష్, ముత్తయ్య, షేన్ వార్న్… ఇలా ఎవరిపేరైనా చెప్పి ఉండాల్సింది. కానీ.. సచిన్ నా పేరును చెప్పడం ఎప్పటికీ మరిచిపోలేను. దానిని గౌరవంగా భావిస్తా. గతంలోనూ నేను చాలా సార్లు సచిన్ గురించి చెప్పా. అతడి మానవతాదృక్పథం చాలా గొప్పది’’ అని రజాక్ తెలిపాడు.