Ajit Agarkar: అగార్కర్ చేతిలో సెలక్షన్ కమిటీ.. టీమిండియా తలరాత మార్చనున్న మాజీ ఆల్ రౌండర్
సీనియర్ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ రేసులో ఉన్న భారత మాజీ ఆటగాడు అజిత్ అగార్కర్.. దిల్లీ క్యాపిటల్స్ సహాయక కోచ్ పదవి నుంచి వైదొలిగాడు.
బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ పదవికి అగార్కర్ ముందు వరుసలో ఉన్నట్లు ఇప్పటికే కథనాలు వస్తున్నాయి. తాజాగా అతను దిల్లీ క్యాపిటల్స్ పదవి నుంచి తప్పుకోవడంతో ఈ కథనాలకు మరింత బలం చేకూరింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఎంపిక అగార్కర్ నేతృత్వంలో జరుగుతుంది. ఇక సెలెక్టర్ల వార్షిక వేతనాల అంశాన్ని బీసీసీఐ సమీక్షించనుంది. ప్రస్తుతం ఏడాదికి ఛైర్మన్‌కు రూ.1 కోటి, సెలెక్టర్లకు ఒక్కొక్కరికి రూ.90 లక్షలు చెల్లిస్తుంది. అయితే దిల్లీ సహాయక కోచ్‌గా, వ్యాఖ్యాతగా అగార్కర్ అంతకంటే ఎక్కువే సంపాదిస్తున్నాడు. వేతన విధానాన్ని సమీక్షించాలని బీసీసీఐ భావిస్తోంది.