IPL 2024 : లైఫ్ టైమ్ సెటిల్మెంట్..

ఐపీఎల్ వేలంలో యువ ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు కాసుల వర్షం కురిపించింది. దుబాయ్ లో జరుగుతున్న మినీ వేలంలో అత్యధికంగా ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ 24.75 కోట్లకు సేల్ అయ్యాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ను 20.75 కోట్లు వెచ్చించి సన్ రైజర్స్ తీసుకుంది. ఈ క్రమంలో.. పలువురు యువ ఆటగాళ్లు కూడా బంపర్ ఆఫర్ కొట్టేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 20, 2023 | 04:33 PMLast Updated on: Dec 20, 2023 | 4:33 PM

Franchises Have Showered Cash On Young Players In The Ipl Auction

 

ఐపీఎల్ వేలంలో యువ ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు కాసుల వర్షం కురిపించింది. దుబాయ్ లో జరుగుతున్న మినీ వేలంలో అత్యధికంగా ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ 24.75 కోట్లకు సేల్ అయ్యాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ను 20.75 కోట్లు వెచ్చించి సన్ రైజర్స్ తీసుకుంది. ఈ క్రమంలో.. పలువురు యువ ఆటగాళ్లు కూడా బంపర్ ఆఫర్ కొట్టేశారు. ఉత్తరప్రదేశ్ కి చెందిన 20 ఏళ్ల సమీర్ రిజ్వీని 8 కోట్ల 40 లక్షలకు చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. జార్ఖండ్ యంగ్ ప్లేయర్ కుమార్ కుషగ్రా కోసం ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. వికెట్ కీపర్ అండ్ బ్యాట్స్‌మెన్ కావడంతో.. భారీ మొత్తంలో అమ్ముడుపోయాడు. కుషగ్రను 7 కోట్ల 20 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. ఇక మిగతా ఆటగాళ్లకు సంబంధించి, గుజరాత్ టైటాన్స్ 7 కోట్ల 40 లక్షలు వెచ్చించి, షారుఖ్ ఖాన్ ను సొంతం చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్, 5 కోట్ల 80 లక్షలతో శివమ్ దూబేను దక్కించుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు, 5 కోట్ల బిడ్ తో, యష్ దయాళ్ ను తీసుకోగా, లక్నో సూపర్ జెయింట్స్ జట్టు, 2 కోట్ల 40 లక్షలతో మనిమారన్ సిద్ధార్థ్ ను తమ జట్టులోకి ఆహ్వానించింది. దేశవాళీ టౌర్నీల్లో అదరగొట్టిన యువకులకు, ఐపీఎల్ ఫ్రాంచైజీలు కళ్ళు చెదిరే ఆఫర్స్ తో వెల్ కమ్ చెప్పాయి.