ఐర్లాండ్ అమ్మాయితో డేటింగ్ గబ్బర్ కొత్త లవ్ స్టోరీ ?
టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రమోషన్ ఈవెంట్లలో పాల్గొంటూ బిజీగా ఉన్నాడు.

టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రమోషన్ ఈవెంట్లలో పాల్గొంటూ బిజీగా ఉన్నాడు. అయితే బంగ్లాదేశ్, భారత్ మ్యాచ్ లో ధావన్ మరో టాపిక్ తో వార్తల్లో నిలిచాడు.
ధావన్ పక్కనే ఓ విదేశీ యువతితో కలిసి తిరగడం, మ్యాచ్ ను వీక్షించడం కనిపించింది. వీరిద్దరూ క్లోజ్ గా ఉన్న ఫోటోలు వైరల్ గా మారడంతో గబ్బర్ కొత్త అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడంటూ ప్రచారం మొదలైంది. పనిలో పనిగా ఆ విదేశీ అమ్మాయి ఎవరని ఆరా తీయడం మొదలుపెట్టిన నెటిజన్లు చాలా సమాచారం సేకరించారు.
ఆమె పేరు సోఫీ షైన్ అని తెలిసింది. ఐర్లాండ్‌కు చెందిన ఈ యువతిని ధావన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో కూడా చేస్తున్నట్లు వెల్లడైంది. దీంతో సోఫీ, ధావన్ మధ్య ఏదో నడుస్తుందని నెటిజన్లు కామెంట్లు గుప్పిస్తున్నారు. ధవన్ కొద్ది రోజుల కిందట ఇదే యువతితో ఎయిర్‌పోర్ట్‌లో కూడా కనిపించాడని అంటున్నారు.ధవన్ 2012లో అయేషాను పెళ్లాడాడు. వీరిద్దరికి సోషల్‌మీడియాలో పరిచయం ఏర్పడింది. అయేషా ధవన్ కంటే పదేళ్లు పెద్దది. ధవన్‌తో పెళ్లి కాక ముందే అయేషాకు వేరే వ్యక్తితో వివాహమైంది. అయేషా ఆ వ్యక్తితో ఇద్దరు కుమార్తెలను కనింది. అయేషా మాజీ కిక్ బాక్సింగ్ ఛాంపియన్.
కాగా, 39 ఏళ్ల ధావన్.. తన మాజీ భార్య, ఆసీస్ పౌరురాలైన అయేషా ముఖర్జీతో విడాకులు తీసుకుని ప్రస్తుతం సింగిల్‌గా ఉంటున్నాడు. ధావన్, ఆయేషాకు జోరావర్ అనే కుమారుడు ఉన్నాడు. అయేషాతో విడిపోయాక ధావన్ ఎక్కువగా తన కుమారుడి గురించి సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నాడు. అయేషా.. బిడ్డను తనతో కలువనివ్వట్లేదని ధవన్ పలు సందర్భాల్లో వాపోయాడు. ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాక ధవన్ ప్రస్తుతం పలు ప్రైవేట్ లీగ్‌ల్లో పాల్గొంటున్నాడు. ధవన్ ఇటీవలే నేపాల్ క్రికెట్ లీగ్‌లో ఆడాడు.