కెప్టెన్ కు చోటు లేనట్టే, హింట్ ఇచ్చిన గంభీర్

కొత్త ఏడాదిలో భారత క్రికెట్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్ తగలబోతోందా... టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్ కు ఎండ్ కార్డ్ పడబోతోందా...సిడ్నీ టెస్టు కోసం తుది జట్టులో కూడా హిట్ మ్యాన్ కు ప్లేస్ లేనట్టేనా... ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 2, 2025 | 07:24 PMLast Updated on: Jan 02, 2025 | 7:24 PM

Gambhir Gives Hint As If There Is No Place For The Captain

కొత్త ఏడాదిలో భారత క్రికెట్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్ తగలబోతోందా… టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్ కు ఎండ్ కార్డ్ పడబోతోందా…సిడ్నీ టెస్టు కోసం తుది జట్టులో కూడా హిట్ మ్యాన్ కు ప్లేస్ లేనట్టేనా… ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. కోచ్ గంభీర్ ఇచ్చిన ఆన్సర్ తో రోహిత్ ను పక్కన పెట్టబోతున్నారన్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. నిజానికి రోహిత్ సిడ్నీ మ్యాచ్ తో టెస్ట్ ఫార్మాట్ కు వీడ్కోలు పలుకుతాడని చాలా మంది భావిస్తున్నారు. వరుస వైఫల్యాల, కెప్టెన్సీలోనూ దూకుడు తగ్గడంతో రిటైర్మెంట్ పై అధికారిక ప్రకటనే మిగిలిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సిడ్నీ టెస్ట్ ఆడి ఘనంగా ముగించేలా ప్లాన్ చేసారన్న వార్తలు కూడా వచ్చాయి. కానీ సిడ్నీ టెస్టుకు ముందు టీమిండియాలో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. చివరి టెస్ట్ కోసం ఎంపిక చేసుకున్న తుది జట్టులో రోహిత్ కు ప్లేస్ లేదని సమాచారం.

మీడియా సమావేశంలో గంభీర్ చేసిన కామెంట్స్ దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. సిడ్నీ టెస్టులో రోహిత్ ఆడతాడా అన్న ప్రశ్నకు గంభీర్ ఇచ్చిన ఆన్సర్ అందరికీ షాకిచ్చింది. పిచ్ ను పరిశీలించాక తుది జట్టుపై నిర్ణయం తీసుకుంటామంటూ చెప్పాడు. తుది జట్టులో కెప్టెన్ కు చోటు లేకుండా ఉంటుందా అన్న సమాధానం కూడా ఇవ్వకుండా… తర్వాత నిర్ణయిస్తామంటూ చెప్పడం ఇక్కడ అనుమానాలకు తావిస్తోంది. గత కొంతకాలంగా రోహిత్ బ్యాటింగ్ పేలవంగా ఉంది… స్వదేశంలో బంగ్లాదేశ్ పైనా, తర్వాత న్యూజిలాండ్ పైనా కూడా ఏమాత్రం రాణించలేదు. ఇప్పుడు ఆస్ట్రేలియా టూర్ లోనూ హిట్ మ్యాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. మూడు మ్యాచ్ లలో ఒక్క ఫిఫ్టీ కూడా లేదు. గత 15 ఇన్నింగ్స్ లో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ ఉండగా… ఇటు కెప్టెన్ గానూ నిరాశపరిచాడు.

బాక్సింగ్ డే టెస్టులో రోహిత్ క్లూలెస్ కెప్టెన్సీ విమర్శలకు తావిచ్చింది. బౌలింగ్ మార్పులు, ఫీల్డింగ్ సెటప్ విషయాల్లో హిట్ మ్యాన్ కెప్టెన్సీ అత్యంత సాధారణంగా ఉందని పలువురు మాజీలు విమర్శించారు. దీంతో అతను రిటైర్మెంట్ ప్రకటించే టైమ్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ కూడా నడిచింది. అయితే తాను రిటైరవ్వడం లేదంటూ బాక్సింగ్ డే టెస్ట్ తర్వాత చెప్పాడు. కానీ తర్వాతి రోజు బీసీసీఐ సెలక్టర్లతో మాట్లాడినట్టు వార్తలు వచ్చాయి. సిడ్నీ టెస్ట్ గెలిచి డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరితే అప్పటి వరకూ కొనసాగుతానని సెలక్టర్లకు అతను చెప్పినట్టు సమాచారం. కానీ ఇప్పుడు చివరి టెస్టుకు తుది జట్టులోనే చోటు దక్కడంపై ఇలాంటి సస్పెన్స్ ఉంటుందని ఎవ్వరూ ఊహించలేదు. అయితే చివరి టెస్ట్ ఆడే అవకాశం రోహిత్ లాంటి ఆటగాడికి ఇవ్వకుండా ఉంటారా అనేది కూడా డౌటే..