కోహ్లీ సెంచరీపై గంభీర్ కుట్ర..? పప్పులు ఉడకలేదా..?
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సెంచరీ అడ్డుకోవడానికి డ్రెస్సింగ్ రూమ్ నుంచి కుట్ర జరిగిందా? అంటే అవుననే ఆన్సర్ వినపడుతోంది

టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సెంచరీ అడ్డుకోవడానికి డ్రెస్సింగ్ రూమ్ నుంచి కుట్ర జరిగిందా? అంటే అవుననే ఆన్సర్ వినపడుతోంది. విరాట్ కోహ్లీ సెంచరీకి ముందు ఉన్న సమయంలో అప్పటివరకు క్రీజ్ లో ఉన్న శ్రేయస్ అయ్యర్ అవుట్ అయిన తర్వాత హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ కు వచ్చాడు సాధారణంగా హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ఆర్డర్ లో ఏడు లేదా 8వ స్థానంలో వస్తాడు. అలాంటిది అనూహ్యంగా అతను బ్యాటింగ్ ఆర్డర్లో ముందు రావడం.. ఆ తర్వాత దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో ఇప్పుడు అభిమానులు అనేక అనుమానాలను సోషల్ మీడియాలో బయటపెడుతున్నారు.
ఎవరైనా ఆటగాడు సెంచరీ ముందు లేదంటే అర్ధ సెంచరీ ముందు ఉంటే అతను ఇలాగే బ్యాటింగ్ ఆర్డర్ లో ముందు వచ్చి వాళ్ళ మైల్ స్టోన్ రీచ్ అవ్వకుండా అడ్డుకుంటాడు అనేది అతనిపై ఉన్న ఆరోపణ. గతంలో తిలక్ వర్మ ఫస్ట్ టి20 ఆఫ్ సెంచరీ విషయంలో.. అలాగే కేఎల్ రాహుల్ సెంచరీ విషయంలో కూడా అతను ఇలాగే బిహేవ్ చేశాడు. ఇక ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో కూడా హార్దిక్ పాండ్యా.. శుభమన్ గిల్ విషయంలో ఇలాగే.. బిహేవ్ చేసాడు. అతనిపై ఒత్తిడి పెంచడంతో గిల్ దూకుడుగా ఆడాడు.
దీనితో 87 పరుగుల వద్ద గిల్ అవుట్ అయ్యాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ విషయంలో కూడా అతను అలాగే ప్రయత్నించి విఫలమయ్యాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో ముందు వచ్చిన హార్దిక్ పాండ్యా.. వచ్చిన వెంటనే ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత దూకుడుగా పరుగులు చేసే క్రమంలో షాహిన్ ఆఫ్రిది బౌలింగ్ లోకి కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్ వచ్చిన అక్షర్ పటేల్.. విరాట్ కోహ్లీకి సింగిల్స్ తీసి సహకరించడంతో కోహ్లీ సెంచరీ పూర్తి చేశాడు. ఈ సెంచరీ కోసం క్రికెట్ ప్రపంచం మొత్తం టీవీలకు అతుక్కుపోయింది.
ఆన్లైన్లో కూడా దీనికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అటు విరాట్ కోహ్లీ కూడా హార్దిక్ పాండ్యా క్రేజ్ లో ఉన్నంత సేపు ఒత్తిడిగా ఫీల్ అయ్యాడు. సాధారణంగా కోహ్లీకి సెంచరీ.. ఇంపార్టెంట్ కాకపోయినా ప్రస్తుతం అతని ఫామ్ ప్రకారం ఈ సెంచరీ చాలా కీలకం. అందుకే సెంచరీ చేయాలని అభిమానులతో పాటుగా అతనిని వ్యతిరేకించే వాళ్ళు కూడా కోరుకున్నారు. ఇక విరాట్ కోహ్లీ కూడా వాళ్ళ అంచనాలకు తగ్గట్టే చివరిలో ఫోర్ కొట్టేసి సెంచరీ కంప్లీట్ చేశాడు. కానీ ఇది మొత్తం ఒక సినిమాలా జరిగిపోయింది.
ఒకవేళ హార్దిక్ పాండ్యా అవుట్ కాకుండా ఉండి ఉంటే.. కోహ్లీ సెంచరీ చేయడం సాధ్యం కాదనేది అభిమానుల మాట. కావాలనే అతనిపై డ్రెస్సింగ్ రూమ్ లో కుట్ర జరిగిందని.. ఒకానొక టైంలో శ్రేయస్ అయ్యర్ కూడా దూకుడుగా బ్యాటింగ్ చేశాడని.. అప్పటివరకు స్లోగా బ్యాటింగ్ చేసిన అయ్యర్ కావాలనే దూకుడు పెంచేసి ఆడాడు అనేది కొంతమంది అభిమానులు చేస్తున్న కామెంట్. టీం ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కావాలనే హార్దిక్ పాండ్యాన ముందు పంపించినట్లు కొంతమంది ఆరోపిస్తున్నారు.