గంభీర్ స్కెచ్ అదిరిందిగా నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్…!

రాహుల్ ద్రావిడ్ తర్వాత టీమిండియా హెడ్ కొచ్ గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్ ఆరంభంలో మిశ్రమ ఫలితాలతో విమర్శలు ఎదుర్కొన్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 14, 2025 | 02:15 PMLast Updated on: Mar 14, 2025 | 2:15 PM

Gambhirs Sketch Is Awesome Next Target Fixed

రాహుల్ ద్రావిడ్ తర్వాత టీమిండియా హెడ్ కొచ్ గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్ ఆరంభంలో మిశ్రమ ఫలితాలతో విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆరంభంలో శ్రీలంకతో వన్డే సిరీస్ ఓటమి, ఆ తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్ తో వైట్ వాష్, ఆ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ని కోల్పోవడంతో గౌతమ్ గంభీర్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.కానీ ఎక్కడా వెనక్కి తగ్గకుండా
తన మార్క్ చూపిస్తున్నాడు. జట్టు ఎంపిక దగ్గర్నుంచి.. జట్టు వ్యూహాల వరకు తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. సంప్రదాయ పద్దతులకు స్వస్తి చెబుతూ.. వినూత్న ఆలోచనలతో దూసుకుపోతున్నాడు. కోచ్‌గా అసాధారణమైన నిర్ణయాలతో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025‌లో టీమిండియాను విజేతగా నిలబెట్టాడు. దుబాయ్ పిచ్‌కు అనుగుణంగా ఐదుగురు స్పిన్నర్లను ఏర్పాటు చేయడంతో పాటు తుది జట్టులో నలుగురు స్పిన్నర్లను ఆడించాడు. అంతేకాకుండా బ్యాటింగ్ డెప్త్ ఉండేలా.. కేఎల్ రాహుల్‌ను ఆరో స్థానంలో ఆడించి ఆశించిన ఫలితాలను రాబట్టాడు.

దీంతో తనని తాను నిరూపించుకోవడానికి ఈ ఛాంపియన్స్ ట్రోఫీ చివరి అవకాశమని అంతా భావించారు. ఇక ఈ టోర్నీలో భారత జట్టును విజయపథం వైపు నడిపించిన గంభీర్అందరి నోళ్లు ముగించాడు. తన హయాంలో తొలిసారి ఐసీసీ ట్రోపీని భారత జట్టుకు అందించాడు.
ఇక ఇప్పుడు ఐపీఎల్ కోసం భారత క్రికెటర్లు సిద్ధమవుతున్నారు. ప్రధాన కోచ్ గా గంభీర్ కి ఈ ఐపీఎల్ ముగిసేంతవరకు జట్టుతో ఉండాల్సిన అవసరం లేదు. ఆ తదుపరి సిరీస్ ల కోసం వ్యూహాలను సిద్ధం చేసుకునేందుకు అతడు సిద్ధమవుతున్నాడు.ఈ నేపథ్యంలో గంభీర్ భారత ఏ జట్టుతో వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. సీనియర్ జట్టు జూన్ లో ఇంగ్లాండ్ కి వెళ్ళనుంది. ఆలోగా భారత ఏ జట్టు ఇంగ్లాండ్ లో పర్యటిస్తుంది . ఇదే విషయాన్ని ఆస్ట్రేలియా పర్యటన అనంతరం గంభీర్ బీసీసీఐ పెద్దలతో చర్చించాడు. భారత ఏ జట్టుతో అతడు ప్రయాణిస్తే.. రిజర్వ్ బెంచ్ ని మరింత బలంగా మార్చుకునే అవకాశం ఉంటుందనేది గంభీర్ అభిప్రాయం.

అలాగే భారత్ ఏ పర్యటనలలో ఓ కీలక విషయం గుర్తించారు. ద్రావిడ్ కోచ్ గా వచ్చాక పరిపూర్ణమైన సిరీస్ లను నిర్వహించారు. అవి ప్రధాన సిరీస్ ల ప్రిపరేషన్ కు బాగా ఉపయోగ పడేవి. ఈ నేపథ్యంలో భారత ఏ జట్టుతో కలిసి వెళితే ప్రయోజనం ఉంటుందని గంభీర్ భావిస్తున్నారని క్రికెట్ వర్గాలు తెలిపాయి. గంభీర్ ఇప్పటికే సూర్య కుమార్ యాదవ్ నేతృత్వంలో బలమైన టి-20 జట్టును నిర్మించాడు. ప్రస్తుతంభారత్ ఎటాకింగ్ స్టైల్ లో అద్భుత విజయాలు నమోదు చేస్తోంది. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా లేని లోటు కూడా కనిపించడం లేదు. అయితే గంభీర్ వన్డే జట్టు పై మరింత దృష్టి పెట్టాలని కూడా నిర్ణయించాడు. అలాగే టెస్ట్ జట్టును పునర్నిర్మించడం గంభీర్ ముందున్న అతిపెద్ద సవాల్. భారత జట్టు ఇంగ్లాండ్ తో కఠిన సిరీస్ ఆడబోతోంది. ఈ కఠిన సవాల్ ని ఎదుర్కొనే క్రమంలో భారత్ ఏ జట్టును సన్నద్ధం చేసేందుకు ప్లాన్ చేసాడు.