Gautam Gambhir: బాబర్ తప్పులే పాక్ కొంపముంచాయి: గౌతమ్ గంభీర్
డీఎల్ఎస్ విధానంలో శ్రీలంక రెండు వికెట్ల తేడాతో పాక్‌పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఈ సందర్భంగా పాక్ సారధి నిర్ణయాలు ఏమాత్రం బాగోలేవని టీమిండియా మాజీ లెజెండ్ గౌతం గంభీర్ అన్నాడు. బాబర్ కెప్టెన్సీ చాలా పేలవంగా ఉందని కుండబద్దలు కొట్టాడు.
Gautam Gambhir: శ్రీలంక చేతిలో ఓడిన పాకిస్తాన్.. ఆసియా కప్ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఉంటే ఫైనల్‌లో భారత్‌ను పాక్ ఢీకొట్టేది. ఫైనల్‌లో దాయాదుల పోరు చూడాలని చాలా మంది అభిమానులు కోరుకున్నారు. కానీ ఆ కల మాత్రం నిజం కాలేదు. ఎనిమిదేళ్ల తర్వాత పాక్‌ను వన్డేలో ఓడించిన శ్రీలంక.. ఫైనల్‌కు దూసుకెళ్లింది. కాగా, ఈ మ్యాచ్‌లో పాక్ ఓటమికి కెప్టెన్ బాబర్ ఆజమ్ చెత్త నిర్ణయాలే కారణమని పలువురు మండిపడుతున్నారు. వర్షం వల్ల ఈ మ్యాచ్‌ను 42 ఓవర్లకు కుదించారు.
ఈ నేపథ్యంలో, డీఎల్ఎస్ విధానంలో శ్రీలంక రెండు వికెట్ల తేడాతో పాక్‌పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఈ సందర్భంగా పాక్ సారధి నిర్ణయాలు ఏమాత్రం బాగోలేవని టీమిండియా మాజీ లెజెండ్ గౌతం గంభీర్ అన్నాడు. బాబర్ కెప్టెన్సీ చాలా పేలవంగా ఉందని కుండబద్దలు కొట్టాడు. “షహీన్ అఫ్రిదీ ఓవర్లో మిడాఫ్ మీదుగా రెండు ఫోర్లు వెళ్లాయి. ఆ రెండు బంతులు కూడా స్లో డెలివరీలే. ఇలా స్లో డెలివరీలు వేసే సమయంలో మిడాఫ్ ఫీల్డర్‌ను లాంగాఫ్‌కు పంపుతారు. అలాగే థర్డ్ మ్యాన్‌ను కూడా వెనక్కు పంపుతారు. ఇది చాలా సింపుల్ స్ట్రాటజీ. అదే చివరి ఓవర్లో కనీసం 13 రన్స్ చేయాల్సి వస్తే శ్రీలంకకు కష్టమయ్యేది” అని గంభీర్ వివరించాడు. చివరి ఓవర్లలో వికెట్ల కోసం చూడాల్సిన అవసరం లేదని, ఆ విషయం బాబర్ అర్థం చేసుకోవాలని గంభీర్ సూచించాడు.
టీ20 తరహా ఫీల్డ్ సెటప్‌తో బ్యాటర్లపై ఒత్తిడి పెంచాల్సిందని అభిప్రాయపడ్డాడు. అలా చేసి ఉంటే ఫలితం వేరుగా ఉండేదని, ఆ రెండు బౌండరీలు వెళ్లేవి కావని చెప్పుకొచ్చాడు. కుశాల్, సమరవిక్రమ మధ్య మంచి భాగస్వామ్యం కుదురుకుంటోంది అనుకున్న వెంటనే.. ప్రధాన బౌలర్లను రంగంలోకి దింపి వారిని అవుట్ చేయడానికి ప్రయత్నించాల్సిందని గంభీర్ విశ్లేషించాడు.