Gautam Gambhir: పాత గూటికి చేరిన గౌతమ్ గంభీర్.. ఎల్ఎస్‌జీకి గుడ్ బై..!
మళ్లీ కోల్‌కతా నైట్ రైడర్స్‌లో తిరిగి చేరుతున్నానని అధికారికంగా ప్రకటించారు. గంభీర్ నిర్ణయాన్ని కేకేఆర్ ఓనర్ షారుక్ ఖాన్ స్వాగతించారు. ఐపీఎల్ 2024లో తమ జట్టుకు మెంటార్‌గా సేవలు అందిస్తారని కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ బుధవారం ప్రకటించారు.

Gautam Gambhir: భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్‌కు గుడ్‌బై చెప్పారు. మళ్లీ కోల్‌కతా నైట్ రైడర్స్‌లో తిరిగి చేరుతున్నానని అధికారికంగా ప్రకటించారు. గంభీర్ నిర్ణయాన్ని కేకేఆర్ ఓనర్ షారుక్ ఖాన్ స్వాగతించారు. ఐపీఎల్ 2024లో తమ జట్టుకు మెంటార్‌గా సేవలు అందిస్తారని కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ బుధవారం ప్రకటించారు. లక్నో జట్టుకు రెండేళ్ల పాటు గౌతీ మెంటర్‌గా పని చేశారు.
REVANTH REDDY: రైతులను ఆదుకుంటామని చెప్పి కేసీఆర్ మాట తప్పాడు: రేవంత్ రెడ్డి
లక్నో సూపర్ జెయింట్స్‌ను వీడుతున్న సందర్భంగా గౌతమ్ గంభీర్ ఓ భావోద్వేగ పోస్ట్ చేశారు. ‘లక్నో సూపర్ జెయింట్స్‌తో నా అద్భుతమైన ప్రయాణం ముగిసింది. ఈ ప్రయాణాన్ని చిరస్మరణీయం చేసిన ఆటగాళ్లు, కోచ్‌లు, సపోర్టింగ్ స్టాఫ్, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. నా ప్రయత్నాలన్నింటికీ మద్దతుగా నిలిచిన ఫ్రాంఛైజీ యాజమాని డా సంజీవ్ గోయెంకాకు ప్రత్యేక ధన్యవాదాలు. లక్నో జట్టు భవిష్యత్తులో అద్భుతాలు చేస్తుందని, ప్రతి ఎల్‌ఎస్‌జీ అభిమానిని గర్వించేలా చేస్తుందని అనుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ ఎల్‌ఎస్‌జీ బ్రిగేడ్’ అని గౌతీ పేర్కొన్నారు.