Gautam Gambhir: నాకు అతడితో బ్యాటింగ్ చేయడం ఇష్టం: గౌతమ్
ఎంఎస్ ధోనీ విషయం ప్రస్తావించిన ప్రతిసారి మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఏదో ఒక విమర్శ చేస్తూనే ఉంటాడు. 2011 ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్‌కు దక్కాల్సిన ఖ్యాతిని.. ధోనీ తన్నుకెళ్లాడని ఇప్పటికే పలుమార్లు బహిరంగంగా వ్యాఖ్యానించాడు.

Gautam Gambhir: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ విషయం ప్రస్తావించిన ప్రతిసారి మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఏదో ఒక విమర్శ చేస్తూనే ఉంటాడు. 2011 ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్‌కు దక్కాల్సిన ఖ్యాతిని.. ధోనీ తన్నుకెళ్లాడని ఇప్పటికే పలుమార్లు బహిరంగంగా వ్యాఖ్యానించాడు. అయితే తాజాగా ధోనీనే తన ఫేవరెట్ పార్టనర్ అని గంభీర్ తెలిపాడు. చాలామంది వీరేంద్ర సెహ్వాగ్ తన ఫేవరెట్ పార్టనర్ అని అనుకుంటారని, కానీ నిజానికి ధోనీతో ఆడటం చాలా ఇష్టపడతాను అని గౌతీ చెప్పాడు.
ICC New Rule: ఐసిసి కొత్త రూల్.. బౌలర్ల మీద పగ..!
తాజాగా గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ ‘నా ఫేవరెట్ బ్యాటింగ్ పార్టనర్ ఎంఎస్ ధోనీ. అయితే ఫ్యాన్స్ అందరూ వీరేంద్ర సెహ్వాగ్ నా ఫేవరెట్ పార్టనర్ అని అనుకుంటారు. నేను ధోనీతో కలిసి ఆడేందుకు ఎక్కువగా అవకాశాలు ఉండేవి కావు. వైట్‌బాల్ క్రికెట్‌లో మహీతో కలిసి ఆడటాన్ని బాగా ఎంజాయ్ చేసేవాడిని. మేం ఎన్నో విలువైన భాగ్వాస్వామ్యాలను నిర్మించాం’ అని తెలిపాడు. ప్రస్తుతం గంభీర్ వ్యాఖ్యలు ధోనీ అభిమానులకు సంతోషాన్ని ఇస్తున్నాయి.